ETV Bharat / sitara

'సూపర్ డీలక్స్​' తెలుగు ట్రైలర్‌ వచ్చేసింది..

author img

By

Published : Aug 3, 2021, 7:30 PM IST

తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సూపర్‌ డీలక్స్‌'. ఈ సినిమా ఆగస్టు 6న ఆహా వేదికగా తెలుగులో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. విజయ్‌సేతుపతి, ఫహాద్‌ ఫాజిల్‌, సమంత తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

super deluxe
సూపర్ డీలక్స్

కరోనా కారణంగా ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే, ఒక చిత్రం కోసం మాత్రం తెలుగు సినీ అభిమానులు ఎంతగానో వేచి చూశారు. ఎట్టకేలకు వారి నిరీక్షణకు ఫలితం ఆగస్టు 6న రానుంది. అదే 'సూపర్‌ డీలక్స్‌'. తమిళంలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్న చిత్రమిది.

ఆగస్టు 6న..

super deluxe
సూపర్ డీలక్స్ పోస్టర్

విజయ్‌సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 6న ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో ఒకేసారి జరిగే వేర్వేరు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ఆద్యంత అలరించేలా త్యాగరాజన్‌ కుమారరాజా దీన్ని తెరకెక్కించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్‌ సేతుపతి, సమంత, ఫహద్‌ఫాజిల్‌, రమ్యకృష్ణ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఈ నలుగురి జీవితాల్లో ఏం జరిగింది? ఆ పరిస్థితుల నుంచి వాళ్లెలా బయటపడ్డారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. అప్పటి వరకు ఈ ట్రైలర్‌ చూసేయండి.

ఇదీ చదవండి: Pushpa: 'పుష్ప' విడుదల తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.