ETV Bharat / sitara

'గని' సినిమాలో పాట పాడిన పాన్ ఇండియా డైరెక్టర్ కుమార్తె

author img

By

Published : Feb 5, 2022, 5:53 PM IST

Ghani songs: 'గని' చిత్రంలోని ఓ పాటను పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ కుమార్తె పాడింది. మరో మూడు రోజుల్లో ఆ సాంగ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఆమె హీరోయిన్​గా తొలి సినిమా చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరంటే?

ghani song aditi shankar
గని మూవీ అదితీ శంకర్

Varuntej ghani movie: మెగాహీరో వరుణ్ తేజ్ 'గని'.. త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో పాటలు రిలీజ్ చేస్తూ, ప్రచారం ఫుల్​గా చేస్తున్నారు. 'రోమియో జూలియట్' అనే సాంగ్​ను ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది.

ghani song aditi shankar
గని మూవీ పోస్టర్

Adithi shankar ghani: పాన్ ఇండియా స్థాయిలో రామ్​చరణ్​తో ప్రస్తుతం సినిమా తీస్తున్న డైరెక్టర్ శంకర్. తమిళంలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్ని తెరకెక్కించిన ఆయన #RC15 వర్కింగ్ టైటిల్​తో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. శంకర్ కుమార్తె అదితీ శంకర్.. తమిళంలో హీరోయిన్​గా పరిచయమవుతోంది. కార్తి 'విరుమన్'లో కథానాయికగా చేస్తోంది. ఇప్పుడు సింగర్​గానూ మెప్పించేందుకు రెడీ అయిపోయింది. తమన్ సంగీతమందించిన 'రోమియో జూలియట్' పాట పాడింది.

aditi shankar
అదితీ శంకర్

బాక్సింగ్ నేపథ్య కథతో తీసిన 'గని'లో వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్​గా నటించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న రిలీజ్ చేస్తామని ఇటీవల ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.