ETV Bharat / sitara

'భీమ్లానాయక్​'.. రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ

author img

By

Published : Oct 4, 2021, 7:58 AM IST

'భీమ్లానాయక్'​(daniel sekhar bheema nayak​) సినిమాలో హీరో రానాకు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్​ నటించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

bheemla nayak
భీమ్లానాయక్​

మలయాళంలో విజయవంతమైన 'అయ్యప్పానుమ్​ కోశియుమ్​'(bheemla nayak movie) సినిమా తెలుగులో 'భీమ్లానాయక్'​గా తెరకెక్కుతోంది. టైటిల్​ పాత్రలో పవన్​కల్యాణ్​ నటిస్తుండగా.. మరో హీరోగా రానా కనిపించనున్నారు. సాగర్​ కె.చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్(trivikram bheemla nayak) ​ స్క్రీన్​ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశి నిర్మాత.

Samyukhta menon
సంయుక్త మేనన్

ఈ సినిమాలో పవన్​కు(bheemla nayak pawan kalyan role) జోడీగా నిత్యామేనన్​ను ఖరారు చేయగా.. రానా(daniel sekhar bheema nayak) సరసన ఎవరు నటిస్తారన్నది ఇంత వరకు స్పష్టత లేదు. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్​ను సంప్రదించినట్లు ఆ మధ్య వార్తలొచ్చినా.. అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పుడీ అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్​ను వరించినట్లు తెలిసింది. ఇదే నిజమైతే ఆమె తొలి తెలుగు చిత్రం అవుతుంది. ఈ సినిమాలో డేనియల్​ శేఖర్​గా(bheemla nayak rananame) రానా ఓ శక్తిమంతమైన పాత్రలో సందడి చేయనున్నారు. ఇది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్​ స్వరాలు సమకూర్చనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'భీమ్లానాయక్' ట్రీట్.. రానా సీరియస్​ వార్నింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.