ETV Bharat / sitara

'ఫ్యామిలీ కోసం సామ్‌ భారీ ప్రాజెక్ట్‌లు వద్దనుకుంది'

author img

By

Published : Oct 10, 2021, 2:25 PM IST

పిల్లల్ని కనేందుకు సమంత (Chaysam Divorce) ఎప్పుడూ నో చెప్పలేదని ఆమె వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ సద్నా సింగ్ వెల్లడించారు. ఫ్యామిలీ మేన్-2 తర్వాత సమంతకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అయితే, కుటుంబం కోసం వాటిని వదులుకున్నారని వివరించారు.

SAM NEWS
సమంత విడాకులు

కుటుంబం అంటే సమంతకు ఎంతో ఇష్టమని ఆమె స్నేహితురాలు, మేకప్‌ ఆర్టిస్ట్‌ సద్నా సింగ్‌ (Sadhana Singh Makeup artist) తెలిపారు. మేకప్ నిపుణురాలిగా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న సద్నా.. గత కొన్ని సంవత్సరాల నుంచి సమంతకు వ్యక్తిగత మేకప్‌ ఆర్టిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సమంత- చైతన్య విడిపోవడానికి (Chaysam Divorce reason) గల కారణాలపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సమంత ఎంతో మంచి వ్యక్తి అని.. ఫ్యామిలీ లైఫ్‌ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని తెలిపారు. చిన్నపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సామ్‌ ఎంతో గౌరవమిస్తారని వివరించారు. ఫ్యామిలీ కోసమే సామ్‌ ఎన్నో భారీ ఆఫర్స్‌ వదులుకుందంటూ సద్నా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. (Chaysam Divorce news)

"కొన్ని సంవత్సరాల నుంచి నేను సమంతకు మేకప్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తున్నాను. ఆమె ఎంతో మంచి మనసున్న వ్యక్తి. టీమ్‌లో ఉన్న ప్రతి ఒక్కర్నీ ఎంతో ప్రేమగా చూసుకునేవారు. చై- సామ్‌ జోడీ చూడముచ్చటగా ఉండేది. చై అంటే సామ్‌కు ఎంతో ఇష్టం. అయితే, వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారన్నది నాకూ పూర్తిగా తెలీదు. కానీ, బయట ప్రచారం జరుగుతున్నట్లు సామ్‌ పిల్లల్ని కనడానికి ఎప్పుడూ నో చెప్పలేదు. ఆమెకు పిల్లలంటే ఎంతో ఇష్టం. త్వరగా పిల్లల్ని కని ఫ్యామిలీ లైఫ్‌ ప్రారంభించాలని ఆమె ఎన్నో కలలు కంది. పిల్లల పెంపకం గురించి తరచూ పుస్తకాలు చదువుతుండేది. 'ఫ్యామిలీ మేన్‌-2' తర్వాత సామ్‌కు బాలీవుడ్‌ నుంచి వరుస అవకాశాలు వచ్చాయి. కొన్ని ప్రతిష్ఠాత్మక, భారీ చిత్రాల్లోనూ సామ్‌ని అడిగారు. కానీ, ఆమె వాటన్నింటికీ నో చెప్పింది. 'భారీ ప్రాజెక్ట్‌ల్లో నటిస్తే కెరీర్‌ ఇంకా బాగుంటుంది కదా. మీరు ఎందుకు నో చెబుతున్నారు?' అని నేను ఓ సారి అడగ్గా.. 'ముందు నాకు ఫ్యామిలీ ముఖ్యం. అందుకే సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుని.. ఫ్యామిలీపై దృష్టిపెట్టాలనుకుంటున్నా' అని సమాధానమిచ్చారు. జుకల్కర్‌-సామ్‌ రిలేషన్‌ గురించి వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదు. జుకల్కర్‌.. సామ్‌ని అక్క అని పిలుస్తాడు" అని సద్నా వివరించారు.

తామిద్దరం విడాకులు తీసుకుంటున్నట్లు చై- సామ్.. అక్టోబర్ 2న (Chaysam Divorce date) సామాజిక వేదికల ద్వారా ప్రకటించారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.