ETV Bharat / sitara

వెండితెరపైకి ఆ స్టార్​ ప్లేయర్​ బయోపిక్​.. నిర్మాతగా దీపికా పదుకొణె

author img

By

Published : Feb 19, 2022, 9:30 AM IST

తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్​ ప్లేయర్​ ప్రకాశ్​ పదుకొణె బయోపిక్​ను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. తన తండ్రి కెరీర్​లో ఎలా ఎదిగారో వివరించారు.

deepika biopic
దీపికా పదుకొణె తండ్రి బయోపిక్​

ఇప్పటివరకు తండ్రి నిర్మాణసంస్థల్లో పనిచేసే వారసులను చూశాం. అయితే అందుకు భిన్నంగా బాలీవుడ్​ హీరోయిన్​ దీపికాపదుకొణె రూట్​ మార్చారు. తన తండ్రి, ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారుడు ప్రకాశ్​ పదుకొణె బయోపిక్​ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు.

"1983 ఏడాది అంటే క్రీడాభిమానులకు చాలా స్పెషల్‌. భారత క్రికెట్‌ జట్టు తొలిసారి ప్రపంచకప్​ గెలుచుకొని ప్రపంచ చూపు మనవైపు తిప్పుకొనేలా చేసింది. నిజానికి దీని కన్నా ముందు ప్రపంచంలో భారత క్రీడల గురించి మాట్లాడుకునేలా చేసిన ఇండియన్‌ క్రీడాకారుల్లో ఒకరు నాన్న ప్రకాశ్‌ పదుకొణె. 1981లో ఆయన బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ గెలుచుకున్నారు. అలా 83 కన్నా ముందే ప్రపంచంలోనే బ్మాడ్మింటన్‌ క్రీడను తన ఆటతో ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఇదంతా నాన్నకు అంత తేలికగా సాధ్యపడలేదు. ఇప్పుడున్నంత అధునాతన వసతులు, సౌకర్యాలు అప్పటి క్రీడాకారులకు లేవు. మ్యారేజీ హాల్లో శిక్షణ తీసుకున్నారు. అప్పట్లో బ్యాడ్మింటన్‌ కోర్టులు అందుబాటులో లేవు. దీంతో మ్యారేజీ హాళ్లను ఆయన బ్యాడ్మింటన్‌ కోర్టులుగా మార్చారు. అనుకూలంగా లేనీ అంశాన్ని.. ఆయన తనకు అనుకూలంగా మార్చుకుని ఒక్కోమెట్టూ ఎదిగారు. ఇప్పుడున్న సదుపాయాలే కనుక ఆనాడే ఉన్నట్లైతే.. మరింత రాణించేవారు"

-దీపికా పదుకొణె, బాలీవుడ్​ హీరోయిన్​

ప్రస్తుతం చిత్ర సీమలో క్రీడా నేపథ్య చిత్రాలకు మంచి ఆదరణ దక్కుతోంది. గతేడాది భారత జట్టు ప్రపంచకప్‌ సాధించిన నేపథ్యంలో వచ్చిన '83' పాజిటివ్​ టాక్​ను సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారామె. ఇక ఈ మార్చి4న ఫుట్‌బాల్‌ ఆటగాడు విజయ్‌ బార్సే బయోపిక్‌ థియేటర్లో విడుదల కానుంది. బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ విజయ్‌గా కనిపించనున్నారు.


ఇదీ చూడండి: Upcoming sports movies: ఈ ఏడాది వెండితెర ఆటగాళ్లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.