ETV Bharat / sitara

విజయ్​ 'లైగర్'​ సినిమాలో ప్రభుదేవా!

author img

By

Published : Mar 28, 2021, 4:45 PM IST

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్​ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న 'లైగర్'​ సినిమాలో ప్రముఖ డ్యాన్సర్​, నటుడు ప్రభుదేవా నటించనున్నాడా అనే సందేహం అభిమానుల్లో కలుగుతోంది. ప్రభుదేవాతో కలిసి దిగిన ఫొటోను పూరి జగన్నాథ్​, ఈ చిత్ర సహ నిర్మాత ఛార్మి పోస్ట్​ చేయడమే ఇందుకు కారణం.

vijay
విజయ్​

హీరో విజయ్​ దేవరకొండ-దర్శకుడు పూరీ జగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్​'. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. హీరోయిన్​గా అనన్య పాండే నటిస్తుండగా.. కీలక పాత్రలో రమ్యకృష్ణ కనిపించనుంది. అయితే ఈ చిత్రంలో ప్రముఖ డ్యాన్సర్​, నటుడు ప్రభుదేవా భాగస్వామ్యం కానున్నాడా? అనే ప్రశ్న అభిమానుల్లో రేకెత్తుతోంది. ఈ సినిమాలో ప్రభు నటించనున్నాడా లేదా ఏదైనా స్పెషల్​ సాంగ్​కు కొరియోగ్రఫీ చేయనున్నాడా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

puri jagannadh
ప్రభుదేవా, పూరీ జగన్నాథ్​, ఛార్మి

ఆదివారం ఈ చిత్ర సహ నిర్మాత ఛార్మి, పూరీ జగన్నాథ్​.. ప్రభుదేవాతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్​ చేయడమే ఈ ఊహాగానాలకు కారణం. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పాన్​ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల కానుంది.

puri jagannadh
ప్రభుదేవా, పూరీ జగన్నాథ్​, ఛార్మి

ఇదీ చూడండి : 'లైగర్' విజయ్ దేవరకొండ వచ్చేస్తున్నాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.