ETV Bharat / sitara

Prabhas: 'బాహుబలి పార్ట్​ 3 ఉండొచ్చు.. వాళ్లు వదిలిపెట్టరు'

author img

By

Published : Mar 4, 2022, 4:18 PM IST

Updated : Mar 4, 2022, 4:26 PM IST

Prabhas Comments on Bahubali: 'బాహుబలి'తో దేశవ్యాప్తంగా ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నాడు హీరో ప్రభాస్​. విడుదలకు సిద్ధమైన తన తాజా చిత్రం రాధేశ్యామ్​ ప్రచారంలో భాగంగా మీడియాతో సమావేశమయ్యాడు. 'బాహుబలి' పార్ట్​ 3 తో పాటు తదుపరి చిత్రం ప్రాజెక్ట్​ కే హీరోయిన్​ దీపిక పదుకొణె గురించి ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు.

prabhas with rajamouli
రాజమౌళితో ప్రభాస్​

Prabhas Comments on Bahubali: 'బాహుబలి'తో పాన్​ ఇండియా స్టార్​గా మారిపోయాడు హీరో ప్రభాస్​. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై 4 ఏళ్లు గడుస్తోంది. భవిష్యత్​లో మూడో పార్ట్​ వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'రాధేశ్యామ్​' ప్రచారంలో భాగంగా మీడియాతో సమావేశమైన ప్రభాస్​.. ఈ విషయంపై స్పందించాడు.

"మేము ఎప్పుడు సినిమాల గురించి మాట్లాడుకోము. మేము చాలా సన్నిహితంగా ఉంటాం. రోజూ మాట్లాడుకుంటాం, కొట్టుకుంటాం. 'సినిమా ఎప్పడు తీస్తున్నావు' అని ఎప్పుడు అడగను. 'బాహుబలి'కి ముందు కూడా అడగలేదు. అతడు గత 10 సంవత్సరాలుగా తెలుసు. ఎందుకో తెలియదు కానీ నేను ఎప్పుడు, ఎవరి సినిమాల గురించి అడగలేదు."

-ప్రభాస్​

భవిష్యత్​లో బాహుబలి మరో పార్ట్​ కొనసాగించాలనే ఆలోచన దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డకు ఉందన్నాడు ప్రభాస్​. "వారిద్దరికి 'బాహుబలి'ని వదిలిపెట్టే ఆలోచన లేదు. కచ్చితంగా ఏదో ఒకటి జరుగుతుంది." అని అన్నాడు.

ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్​' విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రచార జోరు పెంచాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్​ ఇండియా చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

రాధేశ్యామ్​ చిత్ర ప్రచారంలో పాల్గొన్న ఆయన తన తదుపరి సినిమా 'ప్రాజెక్ట్​ కే' హీరోయిన్ దీపికా పదుకొణె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు. తాము మొదటిసారి సెట్స్​పై కలిసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాడు.

"మేము 'ప్రాజెక్ట్​ కే' సెట్స్​లో కలిసాం. నువ్వు సిగ్గుపడతావా? అని దీపిక నన్ను అడిగింది. మొదటి రోజుల్లో నేను కూడా సిగ్గుపడేవాడిని. వారితో సౌకర్యవంతంగా అయ్యాక ఆపకుండా మాట్లాడేవాడిని. కొన్నిసార్లు జోకులు వేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేసేవాడిని."

-ప్రభాస్​

దీపిక పదుకొణె తాజాగా 'గెహ్రాహియా' చిత్రంలో నటించింది. 'ప్రాజెక్ట్​ కే' చిత్ర షూటింగ్​ సమయంలో ప్రభాస్​ నటి దీపికకు దక్షిణాది వంటకాలతో ఆతిథ్యం ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ్​ అశ్విన్​ దర్శకత్వం వహిస్తుండగా వైజయంతి మూవీస్​ నిర్మిస్తోంది.

ఇదీ చదవండి: ప్రభాస్ సినిమాకు ఆనంద్‌ మహీంద్రా సాయం కోరిన దర్శకుడు

Last Updated : Mar 4, 2022, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.