ETV Bharat / sitara

పెళ్లి తర్వాత నాలో మార్పేదీ రాలేదు: రానా

author img

By

Published : Nov 3, 2020, 8:18 PM IST

వివాహం తర్వాత తన వ్యక్తిగత జీవితంలో పెద్దగా మార్పులేవీ జరగలేదని అంటున్నాడు నటుడు రానా దగ్గుబాటి. కానీ, పెళ్లైన తర్వాత మరింత బాధ్యతాయుతంగా మారినట్లు తెలిపాడు.

No major changes in my life after marriage: Rana Daggubati
పెళ్లి తర్వాత నాలో మార్పేది రాలేదు: రానా

ఆగస్టులో ఓ ఇంటివాడైన దగ్గుబాటి రానా దసరా పండుగను తన మెట్టినింట జరుపుకున్నాడు. తన భార్య మిహికా బజాజ్​ కుటుంబంతో సరదాగా గడిపాడు. అయితే వివాహం అయ్యాక కూడా తనలో పెద్దగా మార్పులేవీ రాలేదని రానా అంటున్నాడు.

"పెళ్లైన తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులేవి జరగలేదు. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏవో పెద్ద మార్పులు తెస్తుందని చాలా మంది అంటారు. కానీ, దానికి వ్యతిరేకంగా నా వ్యక్తిగత జీవితంలో పెద్దగా మార్పులేవి గమనించలేదు. ఇప్పుడు మరింత బాధ్యతాయుతమైన వ్యక్తిగా భావిస్తున్నా."

- రానా దగ్గుబాటి, కథానాయకుడు

రానా ప్రస్తుతం 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా ఆగిపోయిన చిత్రీకరణ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇందులో సాయి పల్లవి, ప్రియమణి, నందితా దాస్​ తదితరులు నటిస్తున్నారు. రానా నటించిన పాన్​-ఇండియా చిత్రం 'అరణ్య' సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఇటీవలే ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.