ETV Bharat / sitara

ఓటీటీలో 'మోసగాళ్లు'.. పూజా పాటకు 100 మిలియన్ వ్యూస్

author img

By

Published : Jun 16, 2021, 12:28 PM IST

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'గద్దలకొండ గణేష్', మోసగాళ్లు, తమిళనాడు రిలీఫ్​ ఫండ్​కు విజయ్ సేతుపతి విరాళం, తుఫాన్ రిలీజ్​ తేదీకి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

movie updates latest
మూవీ న్యూస్

*మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన 'మోసగాళ్లు' ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. సైబర్ మోసాల ఆధారంగా తీసిన ఈ చిత్రం.. అమెజాన్ ప్రైమ్​లో బుధవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

mosagallu ott
మోసగాళ్లు పోస్టర్

*ఫర్హాన్ అక్తర్ నటించిన బయోపిక్ 'తుఫాన్' విడుదల తేదీ ఖరారైంది. జులై 16న ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ఫర్హాన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అంతకుముందు మే21న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా దానిని వాయిదా వేశారు.

*'గద్దలకొండ గణేశ్​' సినిమాలోని 'ఎల్లువచ్చి గోదారమ్మ' సాంగ్.. 100 మిలియన్​ ప్లస్​ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్నే చెబుతూ చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, తమిళనాడు రిలీఫ్​ ఫండ్​కు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను రూ.10 లక్షల డీడీని ముఖ్యమంత్రి స్టాలిన్​కు అందజేశారు.

vijay sethupathi
ముఖ్యమంత్రి స్టాలిన్​తో విజయ్ సేతుపతి
Kalaippuli S Thanu
నిర్మాత కలైపులి ఎస్.థాను

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.