ETV Bharat / sitara

'జైలుకు వెళ్లాల్సిన వాళ్లు బయట తిరుగుతున్నారు'

author img

By

Published : Jul 21, 2021, 7:42 PM IST

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్​ ఎన్నికలపై హీరో మంచు విష్ణు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలని పరిశ్రమలోని పెద్దలు కొందరు తనను కోరారని చెప్పారు. ఆ తర్వాత తాను ఆ పదవికి పోటీ చేయాలని నిర్ణయించాకే మిగిలిన వాళ్లు ఎన్నికల ప్రస్తావన తెచ్చారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Manchu Vishnu Sensational Comments on MAA Elections
'జైలుకు వెళ్లాల్సిన వాళ్లు బయట తిరుగుతున్నారు'

మూవీ ఆర్టిస్ట్​ అసోసియేషన్‌ 'మా' ఎన్నికల(MAA Elections) వ్యవహరం నానాటికీ రాజకీయాలను తలపిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తోన్న సభ్యులు పరస్పరం ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మంచు విష్ణు మరోసారి 'మా' ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'మా' రాజకీయాలు, కొంతమంది నటులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అధ్యక్ష పదవి కోసం పోటీ చేయమని పరిశ్రమ పెద్దలే తనను కోరారని మంచు విష్ణు వెల్లడించారు. అయితే, ఆ సమయంలో పోటీలో ఎవరూ నిలబడలేదని, ఇప్పుడు కొంతమంది పోటీలోకి వచ్చారని విష్ణు తెలిపారు. 'మా'కు శాశ్వత భవన నిర్మాణం అనే ఎజెండాతో అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. కాకపోతే, దానిని మించిన ఎన్నో సమస్యలు 'మా'లో ఉన్నాయని ఆయన అన్నారు.

ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, దాసరి నారాయణరావు వంటి పెద్దలు ఉన్నప్పుడు సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు వచ్చినా ముందు ఉండేవాళ్లని.. కానీ, ఇప్పుడు సినీ పరిశ్రమకు పెద్దదిక్కు అంటూ ఎవరూ లేరని విష్ణు వ్యాఖ్యానించారు. అలాగే పరిశ్రమలో ఎంతోమందికి తాను సాయం చేశానని ఆ పేర్లు ఇప్పుడు చెప్పనని ఆయన అన్నారు. కొంతమంది జైలుకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారని.. వాళ్లు కనుక శ్రుతి మించి మాట్లాడితే తప్పకుండా వాళ్ల పేర్లు బయటపెడతానంటూ విష్ణు హెచ్చరించారు.

ఇదీ చూడండి.. ఆర్జీవీ మెచ్చిన లవ్​ సాంగ్​.. 'హీరో' సినిమా ట్రైలర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.