ETV Bharat / sitara

విజయ్​ సేతుపతి - కత్రినా కైఫ్​ కాంబినేషన్​ ఫిక్స్​!

author img

By

Published : Jun 24, 2021, 5:32 AM IST

తమిళ విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి, బాలీవుడ్​ హీరోయిన్​ కత్రినా కైఫ్​ కాంబినేషన్​లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్​లో 'మేరీ క్రిస్మస్​' అనే చిత్రం ఖరారు కాగా.. ఇప్పుడు శ్రీరామ్​ రాఘవన్​ దర్శకత్వంలో కలిసి నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

Katrina Kaif starts preparing for Director Sriram Raghavan's next project
విజయ్​ సేతుపతి - కత్రినా కైఫ్​ కాంబినేషన్​ ఫిక్స్​!

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాలీవుడ్​ హీరోయిన్​ కత్రినా కైఫ్​ వరుస సినిమా షూటింగ్​లతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో కత్రినా తదుపరి చిత్రం గురించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. శ్రీరామ్‌రాఘవన్‌ దర్శకత్వంలో రాబోతున్న ఓ చిత్రంలో తమిళ హీరో విజయ్‌సేతుపతి సరసన కథానాయకగా నటించేందుకు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

అయితే వీరిద్దరి కాంబినేషన్​లో 'మెరీ క్రిస్మస్'​ అనే చిత్రం రూపొందనుందని గతంలో వార్తలు వచ్చాయి. త్వరలోనే షూటింగ్​ ప్రారంభించనున్నామని నిర్మాత రమేశ్​ తౌరు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఏప్రిల్​లోనే మొదలవ్వాల్సిన ఈ సినిమా షూటింగ్.. కత్రినాకు కరోనా రావడం వల్ల నిలిచిపోయింది. ఆ తర్వాత సెకండ్​ వేవ్ ప్రభావంతో షూటింగ్​లు ఆగిపోయాయి. అయితే జులై​లో చిత్రీకరణ ప్రారంభించాలని అనుకుంటున్నట్లు నిర్మాత రమేశ్​ తెలిపారు.

ఇదే కాకుండా విజయ్ సేతుపతి 'ముంబయికర్', 'గాంధీ టాక్స్', రాజ్​-డీకే దర్శకత్వంలో వెబ్​ సిరీస్​లో నటిస్తున్నారు. వీటి షూటింగ్​ కూడా కరోనా కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: 'శాకినీ-ఢాకినీ'గా రెజీనా, నివేదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.