ETV Bharat / sitara

జాన్వీ టాలీవుడ్​ ఎంట్రీ ఖాయం.. ఒకేసారి రెండు సినిమాలతో?

author img

By

Published : Jan 29, 2022, 7:37 AM IST

Janhvi kapoor upcoming movies:బాలీవుడ్​ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్.. తెలుగులో అరంగేట్రం చేయడం దాదాపు ఖరారైందని సమాచారం. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించనుందట.

Janhvi kapoor
జాన్వీ కపూర్

Janhvi kapoor telugu: శ్రీదేవి తనయ జాన్వీకపూర్‌ తెలుగు తెరపై మెరిసే సమయం ఆసన్నమైందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానాన్నే వినిపిస్తున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. జాన్వీ తెలుగు సినిమాల్లో నటిస్తుందనే ప్రచారం ఇప్పటిదేమీ కాదు. ఆమె తెలుగు సినిమాతోనే పరిచయం కానుందని కూడా అప్పట్లో చెప్పుకొన్నారు. కొందరు నిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆమె మాత్రం హిందీ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పుడైతే ఒకప్పటిలాగా హిందీ, తెలుగు అని భాషా పరమైన హద్దులేమీ లేవు. ఎక్కడ సినిమా చేసినా దేశంలోని భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల ప్రజలూ చూస్తున్నారు. తెలుగులో అగ్ర తారల సినిమాలన్నీ కూడా ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలోనే రూపొందుతున్నాయి. దాదాపు సినిమాల్లో బాలీవుడ్‌కు చెందిన కథానాయికలే నటిస్తున్నారు. ఈ దశలోనే జాన్వీ కపూర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రెండు ప్రధానమైన సినిమాల్లో ఆమె పేరు వినిపిస్తోంది. ఒకటి ఎన్టీఆర్‌ సినిమా కాగా, మరొకటి విజయ్‌ దేవరకొండ చిత్రం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం బుచ్చిబాబు క్రీడానేపథ్యంతో కూడిన ఓ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో కథానాయికగా జాన్వీని సంప్రదించినట్టు సమాచారం.

Janhvi kapoor
జాన్వీ కపూర్

అలాగే విజయ్‌ దేవరకొండ - పూరీ జగన్నాథ్‌ కలయికలోనూ మరో సినిమా ప్రచారంలో ఉంది. 'లైగర్‌' తర్వాత ఆ సినిమా పట్టాలెక్కుతుందని, అందులో కూడా కథానాయికగా జాన్వీ దాదాపు ఖాయమని టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.