ETV Bharat / sitara

బిస్లరీ వాటర్​తో స్టార్ హీరోయిన్ స్నానం

author img

By

Published : Aug 23, 2021, 8:06 PM IST

షూటింగ్​ల్లో హీరోయిన్లు ఏది డిమాండ్​ చేస్తే అది తెచ్చి పెట్టాల్సిందే. అలా ఔట్​డోర్​ షూటింగ్​లో అందరూ గోదావరి నది నీటితో స్నానం చేస్తే ఓ నటి మాత్రం బిస్లరీ వాటర్ డిమాండ్ చేశారట. ఇంతకీ ఆమె ఎవరంటే?

bisleri water for bath
శ్రీ విద్య

షూటింగ్‌ సమయంలో హీరోయిన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. స్టార్‌ కథానాయిక అయితే, వాటి జాబితా ఇంకాస్త పెరుగుతుంది. తినే ఆహారం నుంచి నిద్రపోయే మంచం వరకూ అన్నీ నాణ్యమైన వాటినే అందించాల్సి ఉంటుంది. అలా కొన్నిసార్లు నిర్మాతకు అదనపు భారం తప్పదు.

bisleri water for bath
శ్రీ విద్య

అలనాటి నటి శ్రీ విద్య అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆమె ప్రసిద్ధ గాయని ఎం.ఎల్‌. వసంతకుమారి కుమార్తె. ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఔట్ డోర్‌ షూటింగ్‌కు రాజమండ్రి దగ్గరలోని గ్రామానికి వెళ్లారు. ఉండటానికి ఏర్పాట్లు బాగానే ఉన్నా, స్నానాలు మాత్రం పక్కనే ఉన్న గోదావరి నీళ్లతో చేయాల్సి వచ్చింది. వరదల కారణంగా నీరు బురదగా ఉండటం వల్ల ఒక రకమైన కాయను అరగదీసి కలిపితే బురద కిందకు పోయి, స్వచ్ఛమైన నీరు పైకి తేలేది. నిర్మాణశాఖలోని సహాయకులు ఆ నీరే పట్టి నటీనటులకి స్నానానికి అందించేవారు.

కానీ, శ్రీ విద్య మాత్రం ఆ నీటితో స్నానం చేసేందుకు అంగీకరించలేదు. ఎంత తేటగా ఉన్నా, ఇంకా వరద బురద కలిసే ఉంటుందని, ఈ నీటితో స్నానం చేస్తే, తన శరీర సొగసు పాడవుతుందని, ఆరోగ్యం దెబ్బ తింటుందని పేచీ పెట్టారు. దాంతో అందరికీ తాగడానికి ఇస్తున్న 'బిస్లరీ' నీటిని తెప్పించి, బకెట్లలో పోసి ఇవ్వమన్నారు. బిస్లరీ వాటర్‌ అప్పుడే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చింది. అప్పుడు లీటరు సీసా ఆరు రూపాయలు. అలాంటి సీసాలు రెండు బకెట్లకి సరిపడా చిత్ర నిర్మాతలు తెప్పించి రెండు పూటలా శ్రీవిద్య స్నానానికి అందించారు.

ఇదీ చూడండి: ప్రియాంక.. నీ సోయగాలు చూస్తే దాసోహమే ఇక!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.