ETV Bharat / science-and-technology

Best Smartphone Offers In October 2023 : రూ.10 వేలకే ఐఫోన్​.. 89% డిస్కౌంట్​తో స్మార్ట్​ఫోన్స్​..​​ డీల్స్​​ అదుర్స్ గురు​!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 4, 2023, 12:16 PM IST

Updated : Oct 4, 2023, 1:34 PM IST

Best Smartphone Offers In October 2023 In Telugu : ఐఫోన్​ లవర్స్​కు​ గుడ్​ న్యూస్​ చెప్పింది యాపిల్. కేవలం రూ.10 వేలకే ఐఫోన్​ 13ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్​ఫోన్స్​పై 89% వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలు మీ కోసం..

Flipkart Big Billion Days Sale 2023
Best Smartphone Offers In October 2023

Best Smartphone Offers In October 2023 : ప్రముఖ ప్రీమియం ఫోన్ల తయారీదారు యాపిల్​ ఐఫోన్​ ప్రియుల​కు శుభవార్త వినిపించింది. కేవలం రూ.10,399కే ఐఫోన్ 13 సిరీస్​ మొబైల్స్​ను అందించనున్నట్లు తెలిపింది. 2023 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్​ ప్రారంభం కంటే ముందే ఈ బంపర్​ ఆఫర్​ను ప్రకటించడం గమనార్హం. 2021లో రూ.79,900 ప్రారంభ ధరతో లాంఛ్ అయింది ఈ ప్రీమియం ఫోన్​. కాగా, అక్టోబరు 8 నుంచి ప్రారంభం కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023లో దీనిని అతి తక్కువ ధరకే అందుబాటులోకి తేనున్నారు. దీనికి సంబంధించి ఫ్లిప్​కార్ట్​ కూడా సోషల్​ మీడియాలో ఓ టీజర్​ను విడుదల చేసింది. అయితే ఈ టీజర్​లో ఐఫోన్​ 13కి సంబంధించి కచ్చితమైన ధరను మాత్రం చూపించలేదు. అయితే దీని ధర రూ.39,999/- లేదా అంతకంటే తక్కువగానే ఉండవచ్చని హింట్​ ఇచ్చింది.

Flipkart Big Billion Days Sale 2023 : గతేడాది జరిగిన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్​లో Apple iPhone 13 బెస్ట్​​ సెల్లర్‌గా నిలిచింది. ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్స్​లో ఐఫోన్ 13ను ఒకటిగా పేర్కొంటున్నారు డీలర్లు. ఐఫోన్​ 13 ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్​లో అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. ఇటీవలే ఐఫోన్​ 15 సిరీస్​ను విడుదల చేసిన యాపిల్​.. తరువాత​ ఐఫోన్​ 13 ధరలను గణనీయంగా తగ్గించింది​.

Apple iPhone 13
ఐఫోన్​ 13

అక్టోబర్ 8న ప్రారంభమయ్యే 2023 ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​​లో Apple iPhone 14 కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతానికి ఐఫోన్​ 13 యాపిల్​ అధికారిక రిటైల్​ స్టోర్స్​లో రూ.59,900/-లకు అందుబాటులో ఉంది. త్వరలో ప్రారంభమయ్యే ఫ్లిప్​కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో దానిని కేవలం రూ.10,399కే కొనుగోలు చేయవచ్చు.

Apple iPhone 13ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7,401 తగ్గింపు తర్వాత రూ.52,499/-లకే లిస్ట్​ చేశారు. దీనితో పాటు కొనుగోలుదారులు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా ట్రాన్సాక్షన్​ చేసి రూ. 2000 వరకు డిస్కౌంట్​ పొందవచ్చు. దీనితో Apple iPhone 13 ధర రూ.50,499కి తగ్గనుంది. అంతేకాకుండా మొబైల్​ యూజర్స్​ తమ పాత స్మార్ట్‌ఫోన్​లను ఎక్స్ఛేంజ్​ కింద ఇచ్చి రూ.40,100 వరకు భారీ డిస్కౌంట్​ను పొందవచ్చు. ఇలా అన్నీ రకాల ఆఫర్లు, బ్యాంక్ రాయితీలు కలుపుకొని కొనుగోలుదారులు Apple iPhone 13ను ఫ్లిప్‌కార్ట్ నుంచి కేవలం రూ.10,399లకే పొందవచ్చు.

Apple iPhone 13 Specifications..

  • 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్‌
  • 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
  • నైట్ మోడ్‌తో 12MP True Depth ఫ్రంట్ కెమెరా
  • 17 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌

Amazon Great Indian Festival Sale 2023 :
అమెజాన్​ గ్రేట్ ఇండియన్​ ఫెస్టివల్​ 2023​లో.. స్మార్ట్​ఫోన్​లపై బంపర్​ ఆఫర్లను ప్రకటించడం జరిగింది. Honor 90, iQoo Z7 Pro, OnePlus Nord CE 3 Lite, Samsung Galaxy M34 5G, Samsung Galaxy S23 Ultra, Motorola Razr 40, Redmi 12 5Gలపై 89% వరకు డిస్కౌంట్​లను అందిస్తున్నాయి. ఎస్​బీఐ కార్డు వినియోగదారులకు అదనంగా 10% రాయితీని అందిస్తున్నారు. వాస్తవానికి అక్టోబర్​ 8 నుంచి అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ ప్రారంభం కానుంది. ప్రైమ్ వినియోగదారులు ఈ ఆఫర్లను అక్టోబర్​ 7 నుంచే వినియోగించుకోవచ్చు. కేవలం మొబైల్​ ఫోన్​లపైనే కాకుండా ల్యాప్​టాప్స్​, స్మార్ట్​వాచెస్​తో పాటు ఇతర ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​పైనా బెస్ట్​ ఆఫర్లు ఉన్నాయి.

అమెజాన్​ స్మార్ట్​ఫోన్​ ఆఫర్స్​

Honor 90 5G :

Honor 90 5G
హానర్​ 90 5జీ
  • అసలు ధర - రూ.47,999/-
  • డిస్కౌంట్​ తర్వాత ధర - రూ.29,999/-

iQoo Z7 Pro :

iQoo Z7 Pro
ఐకూ జెడ్​7 ప్రో
  • అసలు ధర - రూ.26,999/-
  • డిస్కౌంట్​ తర్వాత ధర - రూ.21,499/-

OnePlus Nord CE 3 Lite :

OnePlus Nord CE 3 Lite
వన్​ప్లస్​ నార్డ్​ సీఈ3 లైట్​
  • అసలు ధర - రూ.19,999/-
  • డిస్కౌంట్​ తర్వాత ధర - రూ.17,999/-

Samsung Galaxy M34 5G :

Samsung Galaxy M34 5G
శాంసంగ్​ గెలాక్సీ ఎం34 5జీ
  • అసలు ధర - రూ.24,499/-
  • డిస్కౌంట్​ తర్వాత ధర - రూ.16,499/-

Redmi 12 5G :

Redmi 12 5G
రెడ్​మీ 12 5జీ
  • అసలు ధర - రూ.15,499
  • డిస్కౌంట్​ తర్వాత ధర - రూ.10,800/-

How To Save Money Using Credit Card : పండుగ షాపింగ్ చేయాలా?.. ఈ క్రెడిట్ కార్డ్​ టిప్స్​తో.. మస్త్​ డబ్బులు ఆదా చేసుకోండి!

Amazon Great Indian Festival 2023 : స్మార్ట్​ఫోన్స్​పై 49%, ల్యాప్​టాప్స్​పై 45% వరకు డిస్కౌంట్​.. అమెజాన్, ఫ్లిప్​కార్ట్​ కిరాక్​ డీల్స్​​!

Last Updated : Oct 4, 2023, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.