ETV Bharat / priya

నాన్​వెజ్​ స్పెషల్​.. మిక్స్​డ్ ఫ్రైడ్ బిర్యానీ చేసేద్దామా?

author img

By

Published : Sep 26, 2021, 7:04 AM IST

ఈరోజు ఆదివారం కదా.. అలా ప్రత్యేక వంటకం తయారు చేసి మీ ఇంట్లో వాళ్లకు వడ్డించండి. అలాంటి వారికోసం మిక్స్​డ్​ ఫ్రైడ్​ బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం.

Mixed Fried Biryani
మిక్స్​డ్ ఫ్రైడ్ బిర్యానీ

ఎంతో మంది ఆహార ప్రియులకు బిర్యానీ ఫేవరెట్​ ఫుడ్​. దీనికి తోడు ఫ్రై పీస్​తో చేసిన బిర్యానీ అంటే ఎంచక్కా లాగించేస్తున్నారు. అయితే ప్రస్తుతం మిక్స్​డ్​ ఫ్రైడ్ బిర్యానీలు ట్రెండ్​గా మారాయి. ఒకే దానిలో మూడు రకాల నాన్​వెజ్​లు దొరకడం వల్ల యువత, ఫ్యామిలీ.. ప్రతిఒక్కరూ దీనికే ఆకర్షితులవుతున్నారు. అయితే దీన్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఎలా తయారుచేసుకోవాలనేది ఓ సారి చూద్దాం.

మిక్స్​డ్​ ఫ్రైడ్​ బిర్యానీ తయారీ విధానం..

ముందుగా ఒక బౌల్​లో నిమ్మరసం, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, గరం మసాలా, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, బియ్యం పొడి, కోడిగుడ్డు, కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మసాలాను చికెన్​ ముక్కలకు, అలాగే మటన్​ ఖీమాకు, రొయ్యలకు.. వేరువేరుగా పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్​లో నూనె పోసుకొని అలాగే కొద్దిగా నెయ్యి వేసుకొని వేడెక్కిన తరువాత కొన్ని మిరియాలు, లవంగాలు, బిర్యానీ పువ్వు, మరాఠీమొగ్గ, అనాసపువ్వు, ఇలాచి, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కలర్​ వచ్చిన తరువాత అందులో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీన, కొత్తమేర, పెరుగు వేసి కలుపుకొని అందులో సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి మూతపెట్టి ఉడికించుకోవాలి. అలాగే డీప్​ ఫ్రై కోసం ఆయిల్​ వేడి చేసుకొని అందులో ముందుగా మారినేట్​ చేసి పెట్టుకున్న చికెన్​ ముక్కలు, మటన్​ ఖీమా, అలాగే ప్రాన్స్​ మూడు ఫ్రై చేసుకొని ప్లేట్​లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్​లో తయారు చేసుకొన్న పులావ్​ని ఫస్ట్​ పెట్టుకొని పై నుంచి చికెన్​ ముక్కలు, మటన్​ఖీమా ఉండలు, రొయ్యలు, ఉడికించుకున్న కోడిగుడ్డుతో సర్వ్​ చేసుకుంటే మిక్స్​డ్ ఫ్రైడ్​ బిర్యానీ రెడీ అవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మిక్స్​డ్​ ఫ్రైడ్​ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • నిమ్మరసం
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​
  • పసుపు
  • గరం మసాలా
  • కారం
  • ఉప్పు
  • జీరా పొడి
  • ధనియాల పొడి
  • బియ్యపు పిండి
  • కోడిగుడ్డు
  • చికెన్​ ముక్కలు
  • మటన్​ ఖీమా
  • రొయ్యలు​
  • నూనె
  • మిరియాలు
  • లవంగాలు
  • బిర్యానీ పువ్వు
  • మరాఠీమొగ్గ
  • యాలకలు
  • బిర్యానీ ఆకు
  • దాల్చిన చెక్క
  • అనాసపువ్వు
  • పచ్చిమిర్చి
  • ఉల్లిపాయలు
  • పుదీనా
  • కొత్తిమేర
  • ఉప్పు
  • పెరుగు
  • నీళ్లు
  • నానబెట్టుకున్న బాస్మతీ బియ్యం

ఇదీ చూడండి: సండే స్పెషల్​ 'మండీ' బిర్యానీని ఇంట్లో చేసుకోండిలా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.