ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా ప్రమాదం... లారీ డ్రైవర్​ మృతి

author img

By

Published : Sep 27, 2020, 10:46 AM IST

రోడ్డు దాటుతున్న లారీ డ్రైవర్​ను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనగా... అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

lorry driver died in road accident at himayat sagar
lorry driver died in road accident at himayat sagar

రంగారెడ్డి జిల్లా ఓఆర్ఆర్​పై ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. హిమాయత్ సాగర్ సమీపంలో గచ్చిబౌలి వెళ్తున్న లారీ డ్రైవర్​... శంషాబాద్​ వెళ్తున్న లారీ డ్రైవర్ వద్ద​ డబ్బులు తీసుకున్నాడు.

తిరిగి తన లారీ వద్దకు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా... గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... డ్రైవర్ మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: కుటుంబ కలహం.. అన్నను హతమార్చిన చెల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.