ETV Bharat / jagte-raho

భార్యను చంపించడానికి మూడు లక్షల సుఫారీ ఇచ్చిన భర్త

author img

By

Published : Oct 20, 2020, 11:15 AM IST

ఓ భర్త... భార్యను చంపించడానికి మూడు లక్షల రూపాయల సుఫారీ ఇచ్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. భర్త చేసిన ప్రయత్నాన్ని ఇల్లందు పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రమేశ్​ తెలిపారు.

husbend plan to his wife murder in badradri kothagudem district
భార్యను చంపించడానికి మూడు లక్షల సుఫారీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా పనిచేస్తున్న వేముల రజిత తన భర్త అయిన గోదావరిఖనికి చెందిన వేముల అశోక్​తో కొంత కాలంగా వేరుగా ఉంటున్నారు.

కాగా తన భార్య వేముల రజితను హతమార్చేందుకు భర్త వేముల అశోక్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరు ప్రసాద్​కు మూడు లక్షల రూపాయల సుఫారీ ఇచ్చారు. రజితను హతమార్చే పథకాన్ని పసిగట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.