ETV Bharat / international

'డొనాల్డ్​ ట్రంప్​ను చంపేస్తాం'.. ఇరాన్​ స్ట్రాంగ్​ వార్నింగ్​

author img

By

Published : Feb 25, 2023, 12:46 PM IST

Updated : Feb 25, 2023, 12:57 PM IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్​. ఆయనను అంతమొందిస్తామంటూ వార్నింగ్​ ఇచ్చారు ఆ దేశ కమాండర్​.

iran Plan to kill Trump
iran Plan to kill Trump

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ను అంతమొందిస్తామని ఇరాన్ తీవ్ర​ హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశపు టాప్‌ కమాండర్‌ను చంపినందుకు అగ్రరాజ్యమైన అమెరికాపై.. తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్‌ ఒకరు వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్​పై అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"2020లో బాగ్దాద్‌లో అమెరికా జరిపిన డ్రోన్‌ దాడిలో మా మిలిటరీ కమాండర్‌ ఖాసిమ్ సులేమాని మరణించారు. దానికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా దళాలపై మా బలగాలు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించాయి. అమాయక సైనికులను చంపాలన్నది మా ఉద్దేశం కాదు. ప్రస్తుతం మా లక్ష్యం అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌. ఆయనను అంతమొందించేందుకు ఎదురుచూస్తున్నాం. సులేమాని హత్యకు ఆదేశాలు జారీ చేసిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, ఆ దేశ మిలిటరీ కమాండర్లు కూడా ప్రాణాలతో ఉండకూడదు"

--హజీజాదే , ఇరాన్​ కమాండర్

పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తుంది ఇరాన్​. దీనిలో భాగంగానే తాజాగా ఓ క్రూజ్‌ క్షిపణిని అభివృద్ధి చేసింది. 1,650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే క్రూజ్‌ క్షిపణిని ఇరాన్‌ అభివృద్ధి చేసిందని రెవల్యూషనరీ గార్డ్స్‌ ఏరోస్పేస్‌ ఫోర్స్‌ అధినేత అమిరాలి హజీజాదే తెలిపారు.

కమాండర్​ సులేమానీ మరణం తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అయితే అగ్రరాజ్యంపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ పదే పదే హెచ్చరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే రష్యాతో మిత్రబంధాన్ని పెంచుకుంటుంది ఇరాన్​. దీనిలో భాగంగా మాస్కోకు డ్రోన్లను కూడా సరఫరా చేసింది. ఈ డ్రోన్లను రష్యా.. ఉక్రెయిన్​పై దాడికి ఉపయోగించింది. దీంతో అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇరాన్​ తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ క్రూజ్‌ క్షిపణి అభివృద్ధి చేయడం ఈ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసినట్లైంది.

ఇవీ చదవండి : చిమ్మచీకటి.. చుట్టూ మంచు.. 13 గంటలపాటు కార్లలోనే ప్రజలు!

దయనీయ స్థితిలో పాక్​​​.. అయినా ఐరాసలో కశ్మీర్​ టాపిక్​..​ వేర్పాటువాదులపై ప్రభావం పడిందా?

Last Updated : Feb 25, 2023, 12:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.