ETV Bharat / international

విషవాయువులు లీక్.. 13 మంది మృతి.. 251 మందికి అస్వస్థత

author img

By

Published : Jun 27, 2022, 10:09 PM IST

Updated : Jun 28, 2022, 8:59 AM IST

Jordan poisonous gas leak: జోర్డాన్​లో దారుణం జరిగింది. ఓ ట్యాంకర్​లోని విషవాయువు లీకై 13 మంది చనిపోయారు. 251 మంది అస్వస్థతకు గురయ్యారు.

Jordan poisonous gas leak
Jordan poisonous gas leak

Gas leak in Jordan: జోర్డాన్​లో విషవాయువులు లీకై 13 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణాన ఉన్న అకాబా నగరంలో ఈ దుర్ఘటన జరిగింది. సుమారు 251 మంది అస్వస్థతకు గురయ్యారని అధికారులు తెలిపారు. గ్యాస్​ ట్యాంకును రవాణా చేస్తుండగా ప్రమాదవశాత్తు లీక్ అయిందని జోర్డాన్ పబ్లిక్ సెక్యూరిటీ డైరెక్టరేట్ వెల్లడించింది. ట్యాంకర్​లో ఏముందనేది ఇంకా తేలలేదని పేర్కొంది. ఘటనాస్థలాన్ని అధికారులు సీల్ చేశారని.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నారని వివరించింది. గ్యాస్​ లీక్​పై దర్యాప్తు జరిపేందుకు నిపుణులను రంగంలోకి దించిందని పేర్కొంది.

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.