ETV Bharat / international

అమెరికా మాజీ అధ్యక్షుడి ఇంట విషాదం.. ట్రంప్​ మొదటి భార్య మృతి

author img

By

Published : Jul 15, 2022, 12:31 PM IST

Ivanna trump death: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మరణించారు. ఆమెకు మరణించిన విషయాన్ని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేశారు.

donald trump wife death
డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య మృతి

Ivanna trump death: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో విషాదం జరిగింది. ఆయన మొదటి భార్య ఇవానా ట్రంప్ గురువారం కన్నుమూశారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ట్రంప్ ఆమె సంతానమే. ఇవానా మరణించిన విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా తెలియజేశారు. ఏ కారణంతో కన్నుమూశారనే విషయాన్ని అందులో పొందుపరచలేదు. ఆమెతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ అద్భుతమైన, శక్తిమంతమైన మహిళగా ఇవానాను పేర్కొన్నారు.

1977లో చెక్​ స్లోవేకియాకు చెందిన మాజీ మోడ‌ల్ ఇవానాను డొనాల్డ్ ట్రంప్‌ పెళ్లి చేసుకున్నారు. 1990 ఆరంభంలోనే విడాకులు తీసుకున్నారు. ఆ త‌ర్వాత 1993లో మేప‌ల్స్‌ను ట్రంప్​ వివాహం చేసుకోగా వారి దాంప‌త్యం 1999 వ‌ర‌కు సాగింది. ఆ త‌ర్వాత 2005లో మెలానియాను ట్రంప్‌ పెళ్లాడారు.

ఇవీ చదవండి: గొటబాయ రాజీనామాకు స్పీకర్ ఆమోదం.. 7 రోజుల్లో కొత్త అధ్యక్షుడు

బ్రిటన్ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తా.. వాటినే నమ్ముతాను: రిషి సునాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.