ETV Bharat / international

ఏపీకి చెందిన​ వావిలాల కృష్ణకు 'అమెరికా జీవిత సాఫల్య పురస్కారం'

author img

By

Published : Dec 8, 2022, 8:29 PM IST

Updated : Dec 8, 2022, 9:40 PM IST

వివిధ రంగాల్లో అంకితభావంతో పనిచేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్ఛంద సేవలు అందించే వారికి అమెరికా ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఇంతటి విశేషమైన ఈ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్​కు చెందిన కృష్ణ వావిలాల ఇటీవలే అందుకున్నారు.

US Presidential Lifetime Achievement Award
వావిలాల కృష్ణ

భారతీయ అమెరికన్​ కృష్ణ వావిలాల(86)కు అరుదైన గౌరవం లభించింది. దేశానికి, సమాజానికి విశిష్ఠమైన సేవలు చేసినందుకుగాను కృష్ణ వావివాలకు అమెరికా సంయుక్త రాష్ట్రాల 'జీవిత సాఫల్య పురస్కారం' వరించింది. అమెరికా అభివృద్ధి పథంలో నడిచేందుకు వివిధ రంగాల్లో అంకితభావంతో పని చేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్చంద సేవలు అందించినందుకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్​.. కృష్ణ వావిలాలను ఎంపిక చేశారు.

గతవారం జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కృష్ణ వావిలాల తన భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలతో సహా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయనకు రెడ్ కార్పెట్​ ఆహ్వానం లభించింది. వావిలాల అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఇంజినీర్స్, తెలుగు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 2006లో కృష్ణ వావిలాల.. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్​లో ఇండియా స్టడీస్ ప్రోగ్రామ్‌ను స్థాపించారు. శాంతి, జాతి పట్ల ఉన్న మక్కువతో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పరేడ్​లలో మహాత్మ గాంధీ వేషధారణలు వేశారు. భారతీయులు, నల్లజాతీయులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృష్ణ ఎంత కృషి చేశారు.

కృష్ణ వావిలాల ఆంధ్రప్రదేశ్​లోని రాజమహేంద్రవరంకు చెందిన వ్యక్తి. ఆయన ఎలక్ట్రిక్ ఇంజినీర్​గా పనిచేసి రిటైరయ్యారు. వావిలాల అమెరికన్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఇంజినీర్స్, తెలుగు కల్చరల్ అసోసియేషన్, హ్యూస్టన్, తెలుగు లిటరరీ అండ్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ కృష్ణ పనిచేశారు.

Last Updated : Dec 8, 2022, 9:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.