ETV Bharat / international

'అమెరికా సహకారం వద్దు.. మేమే ఆ ఉగ్రవాదుల పని పడతాం'

author img

By

Published : Oct 9, 2021, 6:06 PM IST

ఇస్లామిక్ స్టేట్​పై పోరాటంలో అమెరికా(Taliban US news) మద్దతు అవసరం లేదని తాలిబన్లు పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని అన్నారు. ఈ మేరకు అమెరికాతో జరిగే చర్చలకు (Taliban US Meeting) ముందు కీలక వ్యాఖ్యలు చేశారు.

taliban news
తాలిబన్ అమెరికా ఉగ్రవాదం

అఫ్గానిస్థాన్​లో తీవ్రవాద బృందాలను నియంత్రించేందుకు అమెరికా సహకారాన్ని కోరే అవకాశాన్ని తాలిబన్లు (Taliban US news) కొట్టిపారేశారు. దోహాలో ఇరుదేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు (Taliban US Meeting) ప్రారంభం కావడానికి ముందు ఈ అంశంపై స్పష్టతనిచ్చారు. ఉగ్రవాదంపై అమెరికాతో కలిసి పనిచేసేది లేదని తేల్చి చెప్పారు. ఇస్లామిక్ స్టేట్​ను తామే నేరుగా ఎదుర్కొంటామని అన్నారు. (Taliban US news)

"అఫ్గానిస్థాన్​లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ కార్యకలాపాలు పెరుగుతున్నప్పటికీ.. ఈ విషయంలో అమెరికాతో సహకారం ఉండబోదు. వారిని స్వతంత్రంగా ఎదుర్కొనే సత్తా మాకు ఉంది."

-సుహెయిల్ షహీన్, తాలిబన్ రాజకీయ ప్రతినిధి

ఇరుదేశాల మధ్య శని, ఆదివారాల్లో చర్చలు (Taliban US Meeting) జరగనున్నాయి. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఇరుదేశాల మధ్య జరుగుతున్న ప్రత్యక్ష చర్చలు (Taliban US Meeting) ఇవే కావడం గమనార్హం. తీవ్రవాదం, అఫ్గాన్ నుంచి విదేశీ పౌరుల తరలింపు ప్రక్రియ అంశాలపై చర్చించనున్నట్లు ఇరుదేశాల అధికారులు తెలిపారు. పౌరుల తరలింపుపై తాలిబన్లు సానుకూలంగా స్పందించారు. మరోవైపు, ఇవి తాలిబన్లకు గుర్తింపు ఇచ్చేందుకు జరిగే చర్చలు కాదని అమెరికా ఇప్పటికే స్పష్టం చేసింది.

పాక్​తో చర్చలు

అంతకుముందు, పాకిస్థాన్ అధికారులతో అమెరికా విదేశాంగ శాఖ ఉపమంత్రి వెండి షెర్మన్ రెండు రోజుల పాటు చర్చలు జరిపారు. అఫ్గానిస్థాన్ అంశంపైనే ఇవి కొనసాగాయి. అఫ్గాన్ నూతన పాలకులతో చర్చలు జరపాలని, ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా అంతర్జాతీయ నిధులను విడుదల చేయాలని అమెరికాను పాక్ అధికారులు కోరారు. అదేసమయంలో, దేశంలో సమ్మిళిత ప్రభుత్వం నెలకొల్పాలని అఫ్గాన్​కు సూచించారు. మానవహక్కులు, మైనారిటీలపై దృష్టిసారించాలని అఫ్గాన్​కు సూచనలు చేశారు.

ఇదీ చదవండి: 'తైవాన్​ను చైనాలో కలిపేసుకుంటాం- అడ్డొస్తే ఊరుకోం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.