ETV Bharat / international

Panjshir valley: 'పంజ్​షేర్'​ తాలిబన్లకు లొంగుతుందా?

author img

By

Published : Aug 23, 2021, 10:46 AM IST

అఫ్గానిస్థాన్​ను ఆక్రమించుకున్న తాలిబన్లు(Afghanistan Taliban).. మెల్లగా పంజ్​షేర్​వైపు(Panjshir valley) కదిలారు. ఈ లోయను తమ వశం చేసుకునేందుకు వందలకొద్దీ ఫైటర్లు భారీ ఆయుధాలతో తరలివెళ్లారు. అయితే.. అక్కడ కాచుకుకూర్చున్న పంజ్​షేర్​ బలగాలు ఏమాత్రం వెనక్కితగ్గేది లేదంటున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రపంచం దృష్టి ఈ ప్రావిన్సుపైనే ఉంది. అసలు పంజ్​షేర్​లో ఏం జరుగుతోంది?

Panjshir valley
అహ్మద్​ మసూద్​

పంజ్​షేర్​.. అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​కు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో హిందుకుష్​ పర్వత శ్రేణుల్లో ఉన్న ప్రాంతం. జనాభా దాదాపు లక్షన్నర. ప్రస్తుతం.. ఈ ప్రావిన్సు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కారణం.. అరాచకాలతో అఫ్గాన్​ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లకు(Afghanistan Taliban) ఇక్కడి ప్రజలు ఎదురొడ్డి నిలవడమే. వారిని ముందుండి నడిపించేంది దిగ్గజ మిలటరీ కమాండర్​ అహ్మద్​ షా మసూద్ (Ahmed Shah Masood) తనయుడు అహ్మద్​ మసూద్​(Ahmad Massoud). అసలు వీరికి అంత తెగువ ఎక్కడిది? పంజ్​షేర్​లో ఇప్పుడు ఏం జరుగుతోంది?

  • అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ ఘనీ.. విదేశాలకు పారిపోయిన నేపథ్యంలో ఆగస్టు 15న దేశాన్ని ఆక్రమించుకున్నారు తాలిబన్లు.
  • మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.
    Panjshir valley
    తాలిబన్లు
  • తాలిబన్లకు భయపడి.. స్థానికులు, విదేశీయులు కాబుల్​ విమానాశ్రయానికి పరుగులు తీశారు. అక్కడ ఇప్పటికీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
  • అమెరికా, భారత్​, కెనడా, ఫ్రాన్స్​, బ్రిటన్​ సహా పలు దేశాలు తమ తమ పౌరుల్ని స్వదేశాలకు తీసుకొచ్చాయి.
  • ఐదు సింహాలు అని అర్థం వచ్చే పంజ్​షేర్​ ప్రావిన్సు మాత్రం తాలిబన్లకు ఎదురుతిరిగింది. ముష్కర ముఠాకు హెచ్చరికలు పంపింది.
  • నాలుగు గంటల్లో లొంగిపోవాలని తాలిబన్లు ఆల్టిమేటం జారీ చేసినా.. పంజ్​షేర్​ లెక్కచేయలేదు. ప్రతిగా.. యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు అహ్మద్​ మసూద్​.
  • చాలా మంది ప్రజలు, సైనికులు తమతో కలిశారని.. తాలిబన్లు దాడి చేయాలని చూస్తే వారికి భారీ నష్టం తప్పదని హెచ్చరించారు.
    Ahmad Massoud
    అహ్మద్​ మసూద్​

''1980ల్లో మేం సోవియట్​ యూనియన్​నే ఎదుర్కొన్నాం. ఇప్పుడు.. తాలిబన్లను ఎదుర్కోవడం పెద్ద కష్టమేం కాదు.''

- అల్​ అరేబియా న్యూస్​ ఛానల్​తో అహ్మద్​ మసూద్​

  • తన తండ్రి.. భారీగా ఆయుధాలు, మందుగుండు తయారుచేశారని, అవి ఇప్పుడు తమకు ఉపయోగపడతాయని చెప్పారు. తాలిబన్ల రాకతో.. తమ ప్రాంతానికి వందలాది ప్రజలు, సైనికులు వచ్చారని.. వారు కూడా యుద్ధానికి సిద్ధమని మసూద్​ వెల్లడించారు.
  • అఫ్గాన్​లో శాంతియుత పరిస్థితులు నెలకొంటే.. తన తండ్రిని చంపిన తాలిబన్లను క్షమించడానికి సిద్ధమని మసూద్​ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో చర్చలకు ఆస్కారం ఉందని అభిప్రాయపడుతున్నారు రాజకీయ నిపుణులు.
  • అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలే కూడా మసూద్​తో కలిశారు. తాలిబన్లను ఎదుర్కొనేందుకు వ్యూహాలు పన్నుతున్నారు.
  • అయితే.. పంజ్​షేర్​ వైపు వెళ్లిన తాలిబన్లపై అక్కడి బలగాలు తిరుగుబాటు చేశాయని వార్తలొస్తున్నాయి.
    Panjshir valley
    పింజ్​షేర్​ వైపు బయలుదేరిన తాలిబన్లు
  • తాలిబన్లు, ఆల్‌ఖైదా ముష్కరులు (AL qaeda) కలిసి నకిలీ విలేకరుల వేషంలో.. ఆత్మాహుతి దాడి జరిపి 2001 సెప్టెంబర్‌ 9న అహ్మద్​ షా మసూద్​ను పొట్టనపెట్టుకున్నారు. అప్పటినుంచి ఆ ప్రాంతాన్ని ముందుండి నడిపిస్తున్నారు ఆయన తనయుడు అహ్మద్​ మసూద్​.

ఇవీ చూడండి: Afghanistan Taliban: మాదకద్రవ్య కర్మాగారంగా అఫ్గాన్‌

Afghan crisis: పంజ్​షీర్​పై తాలిబన్ల కన్ను- కోట కూలేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.