ETV Bharat / international

'అవును మా భూమిని చైనా ఆక్రమించింది'

author img

By

Published : Nov 4, 2020, 6:33 PM IST

నేపాల్​ భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలను ధ్రువీకరించారు ఆ దేశ సరిహద్దు ప్రజలు. ఎన్నో ఏళ్లుగా ప్రజల చేతిలో ఉన్న భూమి.. ప్రస్తుతం చైన అధీనంలో ఉందని, దాంతో ఆక్రమణకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Nepali villagers confirm China seizing
నేపాల్​ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్​కు చెందిన 150 హెక్టార్లకుపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న నివేదికలను ధ్రువీకరించారు ఆ దేశ ప్రజలు. మే నుంచి తమ భూమిని చైనా ఆక్రమించుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. ఓ వైపు ఈ అంశాన్ని చైనా తిరస్కరించటం, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ మౌనంగా ఉన్న సందర్భంలో సరిహద్దు గ్రామాల ప్రజలు డ్రాగన్​ దురాక్రమణను వెల్లడించటం గమనార్హం.

నేపాల్​ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందన్న బ్రిటన్​ టెలిగ్రాఫ్​ నివేదికను హుమ్లా జిల్లాలోని గ్రామాల ప్రజలు నిర్ధరించారు. తమ భూభాగాన్ని డ్రాగన్​ దేశం స్వాధీనం చేసుకుందని స్పష్టం చేశారు.

"చాలా ఏళ్లుగా స్థానిక ప్రజల చేతిలో ఉన్న భూ భాగం ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. దీని ద్వారా మా భూమిని చైనా ఆక్రమించిందని స్పష్టంగా తెలుస్తోంది. హిల్సా జిల్లాలోనే 70 హెక్టార్ల భూమిని ఆక్రమించింది. "

- పల్జోర్​ లామా, లిమీ లోయలోని గ్రామస్థుడు.

నేపాల్​కు చెందిన 150 హెక్టార్లకుపైగా భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని బ్రిటన్​ పత్రిక 'ది టెలిగ్రాఫ్​' కథనం వెల్లడించింది. రెండు దేశాల సరిహద్దు సమీపంలోని అయిదు జిల్లాల్లో ఈ భూమిని డ్రాగన్​ కబళించిందని, సహజసిద్ధ సరిహద్దుగా ఉన్న ఒక నదిలో నీళ్ల ప్రవాహాన్నీ దీని కోసం మళ్లించిందని బయట పెట్టింది.

ఇదీ చూడండి: నేపాల్​లో 150 హెక్టార్లను ఆక్రమించిన చైనా...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.