ETV Bharat / international

Live Video: పిడుగు పడినా.. ప్రాణాలతో సేఫ్​గా...

author img

By

Published : Dec 27, 2021, 6:54 PM IST

Man survives lightning strike: పిడుగుపాటుకు గురైన ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఇండోనేసియాలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో.. నెట్టింట వైరల్​గా మారింది.

Man survives lightning strike
పిడుగు పడినా.. ప్రాణాలతో బయటపడ్డాడు

Man survives lightning strike: పిడుగుపాటుకు గురైన తర్వాత బతకడం అంటే.. అత్యంత అరుదుగా మాత్రమే జరిగే విషయం. ఇండోనేసియాలోనూ ఇలాంటి ఓ అరుదైన సంఘటన జరిగింది. పిడుగు పడినప్పటికీ.. ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు.

గొడుగుతో వెళ్తుండగా..

Indonesia lightning strike: జకార్తాలోని ఓ పరిశ్రమలో 35 ఏళ్ల వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. డ్యూటీలో ఉన్న సమయంలో అతనిపై పిడుగు పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.

ఆ సెక్యూరిటీ గార్డు.. వర్షం పడుతుండగా గొడుగు పట్టుకుని నడుస్తూ ఉండడం ఆ వీడియోలో కనిపించింది. కొన్ని సెకన్ల తర్వాత అతనిపై పిడుగు పడింది. ఆ సమయంలో భారీగా మెరుపులు కనిపించాయి. దాంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత.. సహోద్యోగులు పరిగెత్తుకుంటూ వచ్చి.. అతడ్ని ఆస్పత్రికి తరలించారు.

Lightining strike viral video: అదృష్టవశాత్తు పిడుగుపాటుకు గురైన ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని 'డెటిక్ న్యూస్​' తెలిపింది. అతని చేతులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పింది. ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయిన అతను.. ప్రస్తుతం తన ఇంట్లోనే కోలుకుంటున్నాడని పేర్కొంది. అయితే... అతని చేతిలో ఉన్న వాకీ-టాకీ కారణంగానే పిడుగు ఆకర్షితమై అతని మీద పడినట్లు కొంతమంది చెబుతుండగా... మరికొంతమంది అతని చేతిలోని గొడుగు వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.

ఈ ఘటన గత వారం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీన్ని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

  • Security officer in Jakarta was struck by lightning while on duty, avoid using radio and cellular telephones when it is raining, the condition of the victim survived after 4 days of treatment. not everyone has the same chance to live. 当選確率 #Bitcoin #NFTs $BTC $ETH #ALERT pic.twitter.com/4XhW6Oh3U9

    — Lexus RZ (@Heritzal) December 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: మేకలు ఎక్కడున్నాయో చెప్పే మ్యాప్​.. ఆ లవర్స్​ కోసమే..!

ఇదీ చూడండి: Loans for babies: పిల్లల్ని కంటే రూ. 25 లక్షల రుణం.. చైనా కొత్త రూల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.