ETV Bharat / international

ట్యాక్సీ డ్రైవర్​కు రూ. 40కోట్ల జాక్​పాట్​

author img

By

Published : Jul 5, 2021, 8:45 AM IST

Updated : Jul 5, 2021, 11:31 AM IST

అబుధాబిలో ట్యాక్సీ డ్రైవర్​గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తికి కలలో కూడా ఊహించని జాక్​పాట్​ తగిలింది. లాటరీలో 3 కోట్ల దిర్హమ్​లు (సుమారు రూ.40 కోట్లు) గెలుచుకున్నాడు.

million dirham jackpot
యూఏఈలో భారీ లాటరీ గెలిచిన భారతీయుడు

అబుధాబిలో ట్యాక్సీ డ్రైవర్​గా పనిచేస్తున్న కేరళకు చెందిన వ్యక్తిని అదృష్టం వరించింది. లాటరీలో 3 కోట్ల దిర్హమ్​లు (సుమారు రూ.40 కోట్లు) గెలుచుకున్నాడు. 37 ఏళ్ల రెంజిత్ సోమరాజన్​ 2008 నుంచి అబుధాబిలో ఉంటున్నాడు. మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. రెండు టికెట్లు కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్​ ఇటీవల అతన్ని ఆకర్శించింది. అన్ని డబ్బులు లేకపోగా.. స్నేహితులకు విషయాన్ని తెలిపాడు. గత నెల 29న మరో 9 మంది సహచరులతో కలిసి తలా 100 దిర్హమ్​లు వేసుకుని తన పేరుపై టికెట్ కొన్నాడు. దీనికే జాక్​పాట్​ తగిలింది.

"ఇలాంటి జాక్​పాట్​ని గెలుచుకుంటానని నేను ఎనాడు అనుకోలేదు. రెండో, మూడో బహుమతి గెలుచుకున్నా చాలు అనుకునేవాన్ని.ఉద్యోగం చేస్తూ గడ్డు పరిస్థితుల్లో బతుకుతున్నాను. కారు డ్రైవర్​గా వివిధ కంపెనీల్లో పనిచేశాను. జీతం సరిపోక సేల్స్​మెన్​లా పనిచేసేవాన్ని."

-రెంజిత్ సోమరాజన్

తన సహచరుల్లో భారత్​, పాకిస్థాన్, నేపాల్​, బంగ్లాదేశ్​ వ్యక్తులు ఉన్నారని సోమరాజన్​ చెప్పాడు. వచ్చే మొత్తాన్ని సమానంగా పంచుకుంటామని అన్నాడు. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో అందరూ నిరంతరం ప్రయత్నించాలని అంటున్నాడు.

ఇవీ చదవండి:నాన్న బర్త్​డేకు ఇలాంటి కానుకా?

తల్లి, తమ్ముడిని కాపాడిన రెండేళ్ల పాప

Last Updated : Jul 5, 2021, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.