ETV Bharat / international

'సమష్టి కృషితోనే కరోనా మహమ్మారిని అరికట్టగలం'

author img

By

Published : Nov 22, 2020, 3:40 PM IST

జీ-20 సదస్సులో ఆయా దేశాధినేతలు పలు కీలక అంశాలపై చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, వ్యాక్సిన్ పంపిణీ​, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై మాట్లాడారు. ఈ క్రమంలో భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలు, వాటికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు.

G-20 summit opens as leaders urge united response to virus
'కరోనాపై కలిసి పోరాటం చేద్దాం'

జీ-20 సదస్సులో.. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై చర్చించారు ఆయా దేశాధినేతలు. వర్చువల్​గా జరిగిన ఈ సమావేశంలో.. కరోనాపై పోరులో జీ-20 దేశాలు ఏ విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయనే దాని గురించి మాట్లాడారు. వైరస్​ కట్టడి, వ్యాక్సిన్​ ఉత్పత్తి, పంపిణీనే ప్రధాన అజెండాగా సాగిందీ సదస్సు.

ఎవరేమన్నారంటే..

''ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఈ జీ-20 సదస్సు నుంచి ఓ భరోసా కల్పిస్తూ సందేశాన్ని పంపాలి. ఇప్పటికే వైరస్ కోసం జీ-20 దేశాలు బిలియన్​ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. చాలా దేశాలు తమ సొంత టీకాని అభివృద్ధి చేసే దానిపై కూడా దృష్టి పెట్టాయి. సదస్సులో భాగమైన అమెరికా,బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ వంటి దేశాలు నేరుగా ఔషధ సంస్థలతో చర్చలు జరిపాయి. తద్వారా వచ్చే ఏడాది నాటికి టీకాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నా.''

- సల్మాన్, సౌదీ అరేబియా రాజు

''కరోనా వైరస్​పై పోరాటంలో భాగంగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేయడం, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. వాటి ఫలితాలు త్వరలోనే పొందుతాం. ఈ సదస్సులో అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. మరికొంత కాలం పనిచేయాలని ఉంది.''

- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

''కరోనాకు వ్యతిరేకంగా ఆరోగ్యపరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతేగాక తదుపరి ఎదుర్కొవాల్సిన సవాళ్ల గురించి కూడా జాగ్రత్త పడాలి.''

- ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు

''ప్రపంచ ఆరోగ్య సంస్థను బలోపేతం చేయాలి. అందరం సమష్టిగా కృషి చేస్తే అన్ని దేశాలకు వ్యాక్సిన్ చవకైన ధరలో దొరుకుతుంది. తద్వారా మహమ్మారిని అరికట్టగలం.''

-ఏంజెలా మెర్కెల్, జర్మనీ ఛాన్సలర్

''కొవిడ్​ను అంతం చేయడానికి, వాతావరణ మార్పులను పరిష్కరించడానికి సంపన్న దేశాల వనరులను ఉపయోగించుకోవాలి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. కరోనా బారిన పడిన తరువాత కూడా వర్చువల్​ విధానంలో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. ప్రజల ఆరోగ్యం, ఆర్థిక వ్యవస్థను ఒకే సమయంలో చూసుకోవాల్సిన సమయమిది.''

- జోరిస్​ జాన్సన్, బ్రిటన్​ ప్రధాని

ఇదీ చూడండి: సమన్వయంతో సంక్షోభాన్ని జయిద్దాం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.