ETV Bharat / international

అమెరికాలో కొత్త రాష్ట్రానికి ప్రతినిధుల సభ ఆమోదం

author img

By

Published : Apr 23, 2021, 11:38 AM IST

అమెరికాలో 51వ రాష్ట్రంగా వాషింగ్టన్​ డీసీని గుర్తించాలంటూ ప్రవేశపెట్టిన ఓ బిల్లుకు ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. సెనేట్​లో ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

america bills
అమెరికా, కొత్త రాష్ట్రం

వాషింగ్టన్​ డీసీని 51వ రాష్ట్రంగా గుర్తించాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుకు.. అమెరికా ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది. 216 మంది సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయగా.. 208 మంది నిరాకరించారు. రిపబ్లికన్లు మాత్రం ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు.

ప్రతినిధుల సభలో డెమొక్రాట్ల మద్దతుతో ఈ బిల్లు గట్టెక్కినా.. సెనేట్​లో ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. సెనేట్​లో రిపబ్లికన్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

జాత్యహంకార వ్యతిరేక బిల్లు..

ఆసియా అమెరికన్లపై విద్వేషపూరిత, జాత్యహంకార చర్యలను అరికట్టేందుకు 'హేట్​క్రైమ్స్'​ బిల్లును ప్రవేశపెట్టగా.. దీనికి సెనేట్​లో ఆమోదం లభించింది.

ఇదీ చదవండి:అక్కడికి ఇక మాస్కుల్లేకుండానే వెళ్లొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.