ETV Bharat / international

ఆ నాలుగు రాష్ట్రాలే ట్రంప్​కు కీలకం!

author img

By

Published : Nov 4, 2020, 4:15 PM IST

అగ్రరాజ్యంలో ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ఇంకా జరుగుతున్న వేళ.. అధ్యక్ష అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఎలక్టోరల్​ ఓట్లలో బైడెన్​ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కీలక రాష్ట్రాల్లో ట్రంప్​నకు పట్టు ఉండటం వల్ల పరిస్థితులు ఏ క్షణంలోనైనా మారిపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

US Elections 2020: Biden-Trump gets into bottleneck fight
ట్రంప్​Xబైడెన్​: హోరాహోరీ పోరులో విజేత ఎవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతపై ఉత్కంఠ కొనసాగుతోంది. అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​- మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్​ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. పలు రాష్ట్రాల్లో బైడెన్​ ముందంజలో ఉన్నప్పటికీ... ట్రంప్​ అధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే కీలక రాష్ట్రాలైన జార్జియా(16), ఉత్తర కరోలినా(15), పెన్సిల్వేనియా(20), మిషిగన్(16)లో ట్రంప్​ ఆధిక్యంలో ఉండటం రిపబ్లికన్లకు సానుకూల అంశం. ఇదే సరళి కొనసాగితే.. ట్రంప్​ మరోమారు శ్వేతసౌధానికి చేరడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్​ ఓట్లలో ట్రంప్​పై బైడెన్​ పైచేయిలో ఉన్నారు. అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు 270 ఓట్లు పొందాలి.

ఇదీ చూడండి- ట్రంప్​ X బైడెన్: గెలుపు మాదంటే మాదేనని..

ట్రంప్​ గెలుచుకున్న రాష్ట్రాలు:-

టెక్సాస్​, ఫ్లోరిడా, ఓహోయో, టెన్నెసీ, కెంటకి, ఇండియానా, ఓక్లహోమా, వెస్ట్‌ వర్జీనియా, సౌత్‌ కరోలైనా, సౌత్‌ డకోటా, నార్త్‌ డకోటా, కేన్సస్‌, అలబామా, లూసియానా, ఆర్కాన్సా, మిస్సోరి, యూటా, మిస్సిసిప్పీ, నెబ్రాస్కా, వయోమింగ్‌.

వీటిల్లో బైడెన్​...

కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినొయ్, న్యూజెర్సీ, మేరీలాండ్, వాషింగ్టన్‌, మాసాచుసెట్స్‌, కొలరాడోలో, కనెక్టికట్‌, ఓరెగన్‌, న్యూమెక్సికో, న్యూహాంప్‌షైర్‌, డెలవెర్‌, డీసీ, వెర్మాంట్‌.

నెవాడా, విస్కాన్సిన్‌లో ఆధిక్యంలో ఉన్నారు బైడెన్‌.

ఇదీ చూడండి:- బైడెన్​కు భారీగా పడిన ముస్లింల ఓట్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.