ETV Bharat / international

ట్రంప్​ విగ్రహానికి 'పంచ్​' దెబ్బ..!

author img

By

Published : Mar 19, 2021, 6:33 PM IST

ఎన్నికల్లో ఓడిపోయినా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. టెక్సాస్​ లాయిస్​​ టుస్సాడ్స్​ వాక్స్​వర్క్స్​లోని ఆయన మైనపు విగ్రహంపై పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. దీంతో విగ్రహం మొహంపై గాట్లుపడ్డాయి. కస్టమర్ల దాడి నుంచి ఆ విగ్రహాన్ని కాపాడేందుకు వేరే చోటకు తరలించారు నిర్వాహకులు.

Trump Wax Figure Moved after People Kept Punching It In The Face
'పంచ్​'ల దెబ్బకు ట్రంప్ మైనపు విగ్రహం వేరే చోటకు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​కు విరోధులు ఎక్కువే! గతేడాది నవంబర్​లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్​ చేతిలో ఓటమి చవిచూసినా.. ట్రంప్​పై కొందరు అమెరికన్లకు ఇంకా కోపం తగ్గలేదు. అందుకే టెక్సాస్​లోని లూయిస్​ టుస్సాడ్స్​ వ్యాక్స్​వర్క్స్​లో ఉన్న ట్రంప్ మైనపు​ విగ్రహంపై అక్కడికి వచ్చే కస్టమర్లు పిడిగుద్దులతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ట్రంప్​ విగ్రహం మొహం భాగంపై పంచ్​ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో ట్రంప్​ మైనపు బొమ్మ మొహంపై గాట్లు పడ్డాయి. చేసేదేమీ లేక విగ్రహాన్ని వేరే చోటకు తరలించారు నిర్వాహకులు.

Trump Wax Figure Moved after People Kept Punching It In The Face
'పంచ్​'ల దెబ్బకు ట్రంప్ మైనపు విగ్రహం వేరే చోటకు

లూయిస్​ టుస్సాడ్స్​ వర్క్స్​ను 'రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్'​ నిర్వహిస్తోంది. అధ్యక్ష విగ్రహాలు ఉండే విభాగంలో తమకు ఎప్పుడూ ఇలాంటి సమస్యలు ఎదురవుతునే ఉన్నాయని ఆ సంస్థ మేనేజర్​ స్టివర్ట్​ తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షులు బుష్​, ఒబామాల విగ్రహాలపై గతంలో ఇలాంటి దాడులు జరిగాయని వివరించారు. ఒబమా మైనపు విగ్రహం చెవులు 6సార్లు పోయాయని, జార్జ్​ వాషింగ్టన్​ బుష్​ విగ్రహం ముక్కును విరగ్గొట్టారని వివరించారు. నేతలను రాజకీయంగా విభేదించే వారు ఆగ్రహావేశాలతో ఇలాంటి దాడులకు పాల్పడుతారని చెప్పారు.

రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్​ 2016లో మూడు ట్రంప్​ మైనపు విగ్రహాలను తయారు చేసి అమెరికాలోని వివిధ చోట్ల ప్రదర్శనకు ఉంచింది. ఒక్కో విగ్రహం కోసం శిల్ప కళాకారులు 6వారాల పాటు శ్రమించినట్లు ఆ సంస్థ తెలిపింది. నిజ జీవితంలో.. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​కు దాదాపు 50శాతం ఓట్లు వచ్చినట్లే.. తమ సంస్థను సందర్శించే వారిలో సగం మంది ట్రంప్ విగ్రహాన్ని ఎంతో ఇష్టపడతారని, మిగతా సగం మంది ఇష్టపడరని పేర్కొంది.

రిప్లే ఎంటర్​టైన్​మెంట్స్ ప్రస్తుతం జో బైడెన్ మైనపు విగ్రహాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది.

ఇదీ చూడండి: 'రైతుల అంశంపై మోదీతో మాట్లాడండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.