ETV Bharat / international

కరుణామయుడైన ట్రంప్​- 143మందికి క్షమాభిక్ష

author img

By

Published : Jan 20, 2021, 12:30 PM IST

అమెరికా అధ్యక్ష పదవిని గురువారం వీడనున్న డొనాల్డ్​ ట్రంప్​ చివరి రోజు దయాగుణాన్ని చాటుకున్నారు. 143మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో ట్రంప్​ మాజీ ముఖ్య వ్యూహకర్త స్టీవ్​ బెనాన్​, ర్యాప్​ స్టార్లు కూడా ఉన్నారు. క్యాపిటల్​ భవనంలో జనవరి 6న విధ్వంసం సృష్టించిన అల్లరిమూకలు కూడా ట్రంప్​ తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు.

Trump pardons ex-strategist Steve Bannon, dozens of others
చివరి రోజు ట్రంప్ దయా గుణం- 143మందికి క్షమాభిక్ష

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షపదవి నుంచి దిగిపోనున్నారు డొనాల్డ్​ ట్రంప్. శ్వేతసౌధంలో బుధవారమే ఆయనకు చివరి రోజు. అందుకే పదవిని వీడే ముందు దయా గుణాన్ని చాటుకున్నారు. అధ్యక్షునిగా చివరి గంటల్లో మొత్తం 143మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. వీరిలో ట్రంప్ మాజీ ప్రధాన వ్యూహకర్త స్టీవ్​ బెనాన్​ కూడా ఉన్నారు. వీరి క్షమాభిక్షపై బుధవారం అర్ధరాత్రి శ్వేతసౌధం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ట్రంప్​ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో ర్యాప్​ స్టార్లు కూడా ఉన్నారు. ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సహా మాజీ ప్రచార సారథి పాల్​ మనఫోర్ట్​, తన అల్లుడు కుశ్నర్​ తండ్రి చార్లెస్​ కుశ్నర్​కు ట్రంప్​ ఇదివరకే క్షమాభిక్ష ప్రసాదించారు.

మాకూ క్షమాభిక్ష కావాలి..

జనవరి 6న క్యాపిటల్​ భవనంలో చెలరేగిన ఘర్షణల్లో పాల్గొని అరెస్టైన ట్రంప్​ మద్దతు దారులు కూడా తమకు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరారు. ట్రంప్ పిలుపు మేరకే తాము క్యాపిటల్​ భవనంలోకి వెళ్లి ఆందోళనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. అధికారులు మాత్రం వారికి క్షమాభిక్ష పెట్టొద్దని ట్రంప్​ను సూచించారు.

వెనిజువెలాపై ఆంక్షలు

చివరి రోజు వెనిజువెలాపైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ట్రంప్ పాలనా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. చమురు విక్రయాలతో ప్రయోజనం పొందుతున్న ఆ దేశ అధ్యక్షుడు నికోలస్​ మధురోనూ లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: జాతి ఐక్యతా ప్రసంగానికి ముందు బైడెన్​​ భావోద్వేగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.