ETV Bharat / international

కీలక రాష్ట్రంపై బైడెన్​ పట్టు- ట్రంప్​ పరిస్థితి ఏంటి?

author img

By

Published : Nov 4, 2020, 8:12 PM IST

అమెరికా అధ్యక్షుడిని నిర్దేశించే అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్​లో డెమొక్రాటిక్​ అభ్యర్థి జో బైడెన్​ ఆధిక్యంలోకి వెళ్లారు. మొదటి నుంచి ఇక్కడ ట్రంప్​ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. బైడెన్​ అనూహ్యంగా దూసుకెళ్లారు. దీంతో ట్రంప్​ గెలుపుపై అనుమానాలు మొదలయ్యాయి.

Tensions in Republican group as Biden inches victory in Michigan
కీలక రాష్ట్రంపై బైడెన్​ పట్టు- ట్రంప్​ పరిస్థితి ఏంటి?

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరులో అనూహ్య మలుపు. అత్యంత కీలక రాష్ట్రాల్లో ఒకటైన మిషిగన్​లో డెమొక్రాటిక్​​ అభ్యర్థి జో బైడెన్​ ఆధిక్యంలోకి వెళ్లడం వల్ల ఎన్నికల సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఒక్క రాష్ట్రాన్ని బైడెన్​ చేజిక్కించుకుంటే.. ఇక మ్యాజికల్​ ఫిగర్​ 270ని అందుకోవడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు.

అనేక రాష్ట్రాల్లో ఆది నుంచి అధ్యక్షుడు ట్రంప్​పై బైడెన్​ ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ అభ్యర్థుల ఓట్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో స్వింగ్​ స్టేట్స్​ కీలకంగా మారాయి. వీటిల్లో చాలా రాష్ట్రాల్లో రిపబ్లికన్ల జోరు కొనసాగుతుండటం వల్ల ట్రంప్​ గెలుపు ఖాయమని అందురు అనుకున్నారు.

అయితే 16 ఎలక్టోరల్​ ఓట్లు ఉన్న మిషిగన్​లోనూ కొద్ది గంటల ముందు వరకు ట్రంప్​ ఆధిపత్యం చెలాయించారు. అనూహ్యంగా పుంజుకున్న బైడెన్​.. అధ్యక్షుడిని దాటి దూసుకెళ్లారు. అభ్యర్థుల ఓట్ల మధ్య తేడా తక్కువే ఉండటం వల్ల ఎప్పుడేం జరుగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

విస్కాన్సిన్(10)​, నార్త్​ కరోలైనా(15), పెన్సిల్వేనియా(20), మిషిగన్(16), జార్జియా​(16), నెవాడా(6) లో ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. విస్కాన్సిన్, మిషిగన్, నెవాడా​​ మినహా ఇతర రాష్ట్రాల్లో ట్రంప్​ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మిషిగన్​లో పుంజుకోకుంటే ట్రంప్​ మరోమారు శ్వేతసౌధానికి చేరుకోవడం కష్టమేనని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- అగ్రరాజ్య ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల హవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.