ETV Bharat / international

అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కు బౌల్డ్​ అయ్యేదెవరు?

author img

By

Published : Nov 4, 2020, 5:20 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్​ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్​ స్టేట్స్​పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది?

Swing states to decide the fate of US Elections 20202?
అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కి బౌల్డ్​ అయ్యేదెవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారిన వేళ.. ఇప్పుడు అందరి చూపు 'స్వింగ్​' స్టేట్స్​పైన పడింది. ఈ రాష్ట్రాలే.. తదుపరి అధ్యక్షుడిని నిర్దేశించనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితాలు వెలువడగా.. మరికొన్నిటిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఆయా రాష్ట్రాల్లో గెలిచిందెవరు?

ఆరిజోనా

ఆరిజోనా(11 ఎలక్టోరల్ ఓట్లు) జో బైడెన్​కు దక్కింది. రిపబ్లికన్లకు పట్టు ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు డెమొక్రాట్ల చెంతకు చేరింది.

ఫ్లోరిడా..

హోరాహోరీ పోరు సాగిన రాష్ట్రాల్లో ఫ్లోరిడా(29) ఒకటి. చివరకు డొనాల్డ్​ ట్రంప్​ ఇక్కడ గెలుపొందారు. 2016లోనూ ట్రంప్​ గెలుపులో ఫ్లోరిడా కీలక పాత్ర పోషించింది.

అయోవా...

అయోవా(6)ను మరోమారు ట్రంప్​ సొంతం చేసుకున్నారు. 2016 వరకు డెమొక్రాట్లకు కంచుకోట అయిన అయోవాలో ట్రంప్​ వరుసగా రెండోసారి విజయం సాధించారు.

నెవాడా..

నెవాడా(6)లో మరోమారు డెమొక్రాట్లదే ఆధిక్యం. గత ఎన్నికల్లో హిల్లరీకి ఓటేసిన ప్రజలు ఇప్పుడు బైడెన్​కే మద్దతు పలికారు.

న్యూ హ్యాంప్​షైర్​..

స్వింగ్​ రాష్ట్రాల్లో కీలకమైన న్యూ హ్యాంప్​షైర్​(4)ను బైడెన్​ దక్కించుకున్నారు. ట్రంప్​పై భారీ ఓట్లతో బైడెన్​ గెలుపొందినట్టు తెలుస్తోంది.

ఒహాయో..

ఎలక్టోరల్​ ఓట్ల పరంగా అత్యంత కీలక రాష్ట్రమైన ఒహాయో(18)లో డొనాల్డ్​ ట్రంప్​ గెలుపొందారు. 2016లోనూ ఇక్కడ ట్రంప్​.. రిపబ్లికన్​ జెండా ఎగరేశారు.

మిన్నెసొటా..

మిన్నెసొటా(10)లో జోబైడెన్​ గెలిచారు. ఈ ప్రాంతంలోని ఆఫ్రో అమెరికన్లు బైడెన్​వైపే మొగ్గుచూపినట్టు కనపడుతోంది.

  • విస్కాన్సిన్(10)​, నార్త్​ కరోలినా(15), పెన్సిల్వేనియా(20), మిషిగన్(16), జార్జియా​(16)లో ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. విస్కాన్సిన్​ మినహా ఇతర రాష్ట్రాల్లో ట్రంప్​ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.