ETV Bharat / international

Sky Surfing: ఆకాశంలో విన్యాసాలు- గింగిరాలు తిరుగుతూ గిన్నిస్​ రికార్డుల్లోకి..

author img

By

Published : Dec 3, 2021, 8:26 PM IST

Updated : Dec 3, 2021, 8:36 PM IST

Sky Surfing: కొంత ఎత్తు నుంచి కిందకు దూకాలంటేనే భయపడతాం. అదే ఆకాశంలో వెళ్తున్న ఫ్లైట్​ నుంచి దూకగలరా? పారాషూట్​​ వేసుకొని ఈ సాహసం చేయాలన్నా భయపడతాం. కానీ ఓ వ్యక్తికి మాత్రం అదే సరదా. హెలికాప్టర్​ నుంచి దూకి.. ఆకాశంలో గింగిరాలు తిరుగుతూ విన్యాసాలు చేస్తాడు. అలా చేసి గిన్నిస్​ రికార్డు కూడా సృష్టించాడు.

Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
Sky Surfing, ఆకాశంలో విన్యాసాలు

Sky Surfer: కీత్​ ఎడ్వర్డ్​ స్నైడర్​.. స్కై ప్రొఫెషనల్​ స్కై సర్ఫర్​. రికార్డులకు మారు పేరు. ఆకాశంలో సాహసాలతో గతంలో ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు చేసిన ఓ ప్రయత్నంతో.. ఏకంగా గిన్నిస్​ రికార్డుల్లోకి ఎక్కాడు.

వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న విమానం నుంచి పారాచ్యూట్​ సాయంతో దూకాలన్న మనం భయపడతాం. కానీ.. ఎడ్వర్డ్​ మాత్రం సులువుగా చేసి చూపించాడు.

ఆకాశంలో స్కై సర్ఫింగ్​ చేస్తూ.. రికార్డ్​ సృష్టించాలనుకున్నాడు. 2021 నవంబర్​ 21న ముహూర్తం సిద్ధం చేసుకొని... ప్రయత్నించాడు. అనూహ్యంగా 13 వేల 500 అడుగుల ఎత్తులో.. విమానం నుంచి పారాషూట్​​తో దూకి సర్ఫింగ్​ చేశాడు. అదీ ఈజిప్ట్​ గీజా పిరమిడ్స్​ మీదుగా.

Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
ఎడ్వర్డ్​ విన్యాసాలు
Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
ప్లేన్​ నుంచి దూకుతూ..
Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
తలకిందులుగా సాహసం

Man Breaks Skysurfing Record

ఆకాశంలో సర్ఫింగ్​ ఏంటనుకుంటున్నారా. అతడి పాదం.. సర్ఫింగ్​ బోర్డుకు జతచేసి ఉంటుంది. హెలికాప్టర్​ తిరిగినట్లుగా మొత్తం 160 సార్లు చక్కర్లు కొట్టాడు. తలకిందులుగా కూడా గింగిరాలు తిరిగాడు. ఇది విమానం నుంచి దూకిన తర్వాత భూమి నుంచి 8,500 అడుగుల ఎత్తులో చేయడం విశేషం.

Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
ఆకాశంలో సర్ఫింగ్​ చేస్తూ
Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
అద్భుత విన్యాసాలు

వీడియో ఫుటేజీని పరిశీలించిన గిన్నిస్​ ప్రతినిధులు.. అతడికి గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు కల్పించారు.

సంబంధిత వీడియోను గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాబ్​ హ్యారిస్​ బాటలో..

ఎడ్వర్డ్స్​.. 1990ల్లో స్కై డైవింగ్​ నేర్చుకున్నాడు. అప్పటికే X-గేమ్స్​ స్పోర్ట్స్​ ఈవెంట్​లో స్కై సర్ఫింగ్​తో సుపరిచితమైన రాబ్​ హ్యారిస్​ను చూసి అతడిని అనుసరించాడు.

Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
సాహసం చేస్తూ..
Sky Surfer Sets Guinness Record with Helicopter Spins
తలకిందులుగా సర్ఫింగ్​

ఇదీ చూడండి: బిడ్డను ఆడిస్తున్న తల్లికి షాక్.. పట్టపగలే దొంగలు వచ్చి బెదిరించి...

మలాశయంలో ఇరుక్కున్న ఫిరంగి గుండు- బాంబ్​ స్క్వాడ్​ సాయంతో చికిత్స

Last Updated : Dec 3, 2021, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.