ETV Bharat / international

Miss Excel Tiktok: టిక్ టాక్​లో టిప్స్ చెబుతూ నెలకు రూ.కోటి సంపాదన

author img

By

Published : Dec 2, 2021, 4:58 PM IST

Miss Excel Tiktok: కేట్​ నోర్టన్​. 27 ఏళ్ల యువతి. కార్పొరేట్ కంపెనీలో మంచి​ ఉద్యోగం వదిలేసింది. అది తన జీవితాన్నే మార్చేసింది. మైక్రోసాఫ్ట్​ ఎక్సెల్​ క్లాస్​లను.. టిక్​టాక్​, ఇన్​స్టాగ్రామ్​లో చెబుతూ నెలకు రూ. కోటి సంపాదిస్తోంది. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించి.. ఆదాయాన్ని పెంచుకోవడమే తన తదుపరి లక్ష్యం అని చెబుతోందా ఇన్​ఫ్లూయెన్సర్​.

Miss Excel Tiktok
టిక్ టాక్​లో టిప్స్ చెబుతూ నెలకు రూ.కోటి సంపాదన, Miss Excel Tiktok, , Excel Tips on TikTok

Miss Excel Tiktok: మైక్రోసాఫ్ట్​ ఎక్సెల్​, గూగుల్​ షీట్స్ గురించి ట్రిక్స్​, టిప్స్​ చెబుతూ విపరీతమైన క్రేజ్​ సంపాదించుకుంది అమెరికా న్యూయార్క్​కు చెందిన కేట్​ నోర్టన్​ అనే 27 ఏళ్ల యువతి. అదీ టిక్​ టాక్​, ఇన్​స్టాగ్రామ్​లలో ఆన్​లైన్​ క్లాస్​లు బోధిస్తూ.

ఇప్పుడు నెలకు రూ. కోటికిపైనే ఆర్జిస్తోంది. అదే రీతిలో సామాజిక మాధ్యమాల్లో లక్షల ఫాలోవర్లను సంపాదించుకుంది.

Teaching Excel Tips on TikTok
ఫన్నీగా ఎక్సెల్​ వీడియోలు రూపొందిస్తున్న కేట్​

కాస్త బోరింగ్​గా అనిపించే.. ఎక్సెల్​, గూగుల్​ స్ప్రెడ్​ షీట్స్​పై పాఠాలు చెప్పేందుకు కేట్​ కార్పొరేట్​ కంపెనీలో తన మంచి ఉద్యోగాన్ని వదులుకుంది. అనుకున్నదే తడవుగా దీనిపై పనిచేయడం ప్రారంభించింది.

Fun and interesting videos on Microsoft Excel programs

మొదట మిస్​ఎక్సెల్​ పేరిట ఇన్​స్టాగ్రామ్​, టిక్​ టాక్​లో ఖాతా ప్రారంభించింది. గతేడాది నవంబర్​లో ఆన్​లైన్​ టీచింగ్​ బిజినెస్​ మొదలుపెట్టింది. మైక్రోసాఫ్ట్​ ఎక్సెల్​ ప్రోగ్రామ్స్​పై ఫన్నీగా డ్యాన్స్​ చేస్తూ, ఆసక్తికరంగా పాఠాలు చెప్పేది. అలాగే హిడెన్​ ట్రిక్స్​, ఫంక్షన్స్​ నేర్పించేది. పూర్తి వినోదాత్మకంగా కూడిన ఈమె క్లాస్​లు వినేవారి సంఖ్య కొద్దిరోజుల్లోనే బాగా పెరిగిపోయింది.

Teaching Excel Tips on TikTok
చక్కటి హావభావాలతో టిక్​టాక్​లో పాఠాలు బోధిస్తున్న కేట్​

కేట్​కు తక్కువ సమయంలోనే మంచి పేరొచ్చింది. సరిపడా రాబడి. 2021 ఏప్రిల్​ నాటికి నెలకు రూ. కోటి ఆదాయం అందుకుంటూ.. అందరూ కలలుగనే మంచి జీవితాన్ని అనుభవించే స్థాయికి చేరింది.

ఏడంకెల ఆదాయమే లక్ష్యం..

తన బాయ్​ఫ్రెండ్​ కూడా ఉద్యోగాన్ని వదిలి.. ఆమెకు సాయం చేశాడు. ఇద్దరూ కలిసి ఇప్పుడు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించే పనిలో పడ్డారు. ఎక్సెల్​, గూగుల్​ షీట్స్​పై ఫుల్​ టైం ట్రైనర్​గా మాత్రమే కాకుండా.. ఇతర ఆన్​లైన్​ ప్రొడక్ట్స్​, కోర్స్​లను చేతినిండా సంపాదిస్తున్నారు.

Teaching Excel Tips on TikTok
ఆన్​లైన్​లో కేట్​ పేరిట ఎక్సెల్​ కోర్సులు

తన సంపాదనను మరింత పెంచుకుంటూ పోవడమే తన తదుపరి లక్ష్యం అని చెబుతోంది నోర్టన్​.

ఇదీ చూడండి: అంతరిక్షం నుంచి నట్టింటి దాకా.. ఈ ఆవిష్కరణలెంతో ప్రత్యేకం!

ఆ వాట్సాప్‌ల జోలికెళ్తే.. డేంజర్‌లో పడ్డట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.