ETV Bharat / international

సొంత కుటుంబసభ్యులనే కాల్చిచంపి.. ఆత్మహత్య!

author img

By

Published : Dec 31, 2020, 7:00 AM IST

ఓ వ్యక్తి కుటుంబసభ్యులను కాల్చిచంపి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలోని హ్యూస్టన్​లో జరిగింది. ఈ దారుణం బుధవారం తెల్లవారుజామున జరిగింది.

man from houston opened fire
అమెరికాలో మరోసారి కాల్పులు

కుటుంబ సభ్యులను ఓ వ్యక్తి తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలోని టెక్సాస్​ రాజధాని హ్యూస్టన్​లో బుధవారం జరిగింది. ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని వారు భావిస్తున్నారు.

చేరుకునే సరికే..

బుధవారం తెల్లవారుజామున ఓ మహిళ తనని కాపాడాలని ఫోన్​ చేసిందని పోలీసులు తెలిపారు. ఆమె ఇంటికి వెళ్లగా అప్పటికే సాయుధుడు కుటుంబ సభ్యులను హతమార్చి ఆత్మహత్య చేసుకున్నాడని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి : ఉగ్రదాడిలో 28 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.