ETV Bharat / international

అన్నంత పని చేసిన ట్రంప్​.. వారికి పోటీగా..

author img

By

Published : Oct 21, 2021, 7:55 AM IST

Updated : Oct 21, 2021, 8:07 AM IST

క్యాపిటల్​ హింసాత్మక ఘటన అనంతర పరిణామాలతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ను(trump latest news) సామాజిక మాధ్యమాలు బహిష్కరించాయి. అప్పటి నుంచి.. సొంత సామాజిక మాధ్యమ వేదికను ట్రంప్​ తీసుకొస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. వాటిని నిజం చేస్తూ ట్రంప్​ తాజాగా తన 'ట్రూత్​ సోషల్​'(truth social media) యాప్​ను ప్రకటించారు. త్వరలో ట్రూత్​ సోషల్​ను ఆవిష్కరించనున్నట్టు వెల్లడించారు.

trump
ట్రంప్​

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్(trump latest news)​.. సొంత సామాజిక మాధ్యమ వేదికను ప్రకటించారు. 'ట్రూత్​ సోషల్​'ను(truth social media) త్వరలోనే లాంచ్​ చేయనున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం ట్రంప్​నకు చెందిన టీఎమ్​టీజీ(ట్రంప్​ మీడియా అండ్​ టెక్నాలజీ గ్రూప్​)-డిజిటల్​ వరల్డ్​ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి(trump social media app).

ఈ సంస్థకు ట్రంప్​ ఛైర్మన్​గా వ్యవహరించనున్నారు. బడా సంస్థల నిరంకుశత్వాన్ని అడ్డుకునేందుకే ట్రూత్​ సోషల్​ను తీసుకొస్తున్నట్టు వెల్లడించారు.

"ట్విట్టర్​లో తాలిబన్ల సంఖ్య చాలా ఎక్కువే. కానీ మీ అభిమాన అధ్యక్షుడికి మాత్రం అందులో చోటు లేదు. ఇలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాము. ట్రూత్​ సోషల్​ ద్వారా నిజాయతీగల సందేశాలను పంచుకునేందుకు నేను ఎదురుచూస్తున్నా. అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చేందుకే టీఎమ్​టీజీని ఏర్పాటు చేశాము."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా మాజీ అధ్యక్షుడు.

ఆ ఘటన తర్వాత...

ఈ ఏడాది జనవరిలో వాషింగ్టన్​లోని క్యాపిటల్​లో హింసాత్మక ఘటన జరిగింది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో ట్రంప్​ మద్దతుదారులు క్యాపిటల్​లోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించారు. అయితే మద్దతుదారులను రెచ్చగొట్టే విధంగా ట్రంప్​ వ్యాఖ్యానించారని ఆరోపణలున్నాయి. దీంతో ట్రంప్​ను సామాజిక మాధ్యమాలు బహిష్కరించాయి. అనంతరం ట్రంప్​ సొంత సామాజిక మాధ్యమ వేదికను ఏర్పాటు చేసుకుంటారని గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై పలు సందర్భాల్లో సంకేతాలు కూడా ఇచ్చారు ట్రంప్​. వీటిని నిజం చేస్తూ తాజాగా.. 'ట్రూత్​ సోషల్​'ను ప్రకటించారు.

Last Updated : Oct 21, 2021, 8:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.