ETV Bharat / international

బస్సు- ట్రక్కు ఢీ.. 16 మంది మృతి

author img

By

Published : Sep 3, 2021, 2:06 AM IST

Updated : Sep 3, 2021, 6:57 AM IST

ఉత్తర మెక్సికోలో ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 16 మంది చనిపోయారు. మరో 22 మంది గాయపడ్డారు.

collision in northern Mexico
మెక్సికోలో ప్రమాదం

ఉత్తర మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్యాసింజర్​ బస్సు, ట్రక్కు ఢీకొనగా 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 22 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

అరిజోనాకు సరిహద్దు పట్టణమైన సోనోయట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు అమెరికా-మెక్సికోలకు సరిహద్దుకు సమాంతరంగా ఉంటుంది. ఇది సోనోయటను శాన్ లూయిస్ రియో కొలరాడోతో కలుపుతుంది.

గాయపడిన 22 మందిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని సోనోరా స్టేట్ ప్రాసిక్యూటర్ కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఇదీ చూడండి: లోయలో పడిన బస్సు- 16 మంది మృతి

Last Updated : Sep 3, 2021, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.