ETV Bharat / entertainment

'అందుకే కాంతారకు ఆస్కార్‌ నామినేషన్ దక్కలేదు'.. కారణం చెప్పిన నిర్మాత

author img

By

Published : Jan 31, 2023, 10:33 PM IST

రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతార. ఇది ఆస్కార్‌కు ఎందుకు నామినేట్‌ కాలేకపోయిందో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ చెప్పారు.

Vijay Kiragandur Comments On Kantara Oscar
విజయ్‌ కిరగందూర్‌ కామెంట్స్​

ప్రచారానికి తగిన సమయం లేకపోవడం వల్లే కాంతార ఆస్కార్‌కు నామినేట్‌ కాలేకపోయిందని అభిప్రాయపడ్డారు నిర్మాత విజయ్‌ కిరగందూర్‌. కాంతార 2కు ఆస్కార్‌ అవార్డు గానీ.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు గానీ వచ్చేలా పని చేస్తున్నామని ఆయన తెలిపారు. కేజీయఫ్‌ సిరీస్‌ చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నిర్మాతాయన. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై వచ్చే ఐదేళ్లలో వీరు నిర్మించే చిత్రాల్లో కాంతార 2 ఒకటి. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద విజయాన్ని అందుకున్న కాంతారకు ప్రీక్వెల్‌గా రూపొందనుంది. కాంతార 2తోపాటు మరికొన్ని సినిమాల గురించి విజయ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

'కొవిడ్‌ సమయం నుంచి ఓటీటీకి ఆదరణ పెరిగింది. విభిన్న నేపథ్యాల సినిమాలు/సిరీస్‌లను ప్రేక్షకులు చూశారు. వారు ఇప్పటి వరకూ చూడని కంటెంట్‌ను అందించడమే ఫిల్మ్‌మేకర్స్‌ ముందున్న లక్ష్యం. మనం మన మూలాల్ని ప్రపంచానికి తెలియజేయాలి. కాంతార, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల ద్వారా జరిగిందదే. సినిమాలే కాకపోయినా కనీసం డాక్యుమెంటరీ రూపంలో మన సంస్కృతిని తెరపైకి తీసుకురావాలి. కాంతార వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కర్ణాటకలోని తుళు నాడు కల్చర్‌ గురించి తెలుసుకున్నారు. వారి అభిరుచి మేరకు అలాంటి కథలపై దృష్టి పెడుతున్నాం. సెప్టెంబరులో(2022) విడుదలకావడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో 'కాంతార'ను ప్రచారం చేయలేకపోయాం. అందుకే ఆస్కార్‌, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌కాలేదనుకుంటున్నా. ఆ లోటును కాంతార 2 తీర్చేలా కష్టపడతాం. 2024 ద్వితీయార్థంలో విడుదలకు ప్లాన్‌ చేస్తున్నాం. ప్రస్తుతం మా నిర్మాణ సంస్థలో సలార్‌, ధూమమ్‌, రఘుతాత, భగీర తెరకెక్కుతున్నాయి. యువ రాజ్‌కుమార్‌(రాజ్‌కుమార్‌ మనవడు)ను హీరోగా పరిచయబోతున్న ప్రాజెక్టు త్వరలోనే ప్రారంభమవుతుంది. కొన్ని వెబ్‌సిరీస్‌లు నిర్మించేందుకు కథలు వెతుకుతున్నాం' అని విజయ్‌ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.