ETV Bharat / entertainment

'ఫ్యామీలీ స్టార్​'గా మారనున్న రౌడీ హీరో.. అందుకోసమేనా?

author img

By

Published : Jun 17, 2023, 8:00 AM IST

Vijay Parasuram Film : విజయ్​ దేవరకొండ- పరశురామ్​ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు తాజాగా మూవీ మేకర్స్​ ఓ డిఫరెంట్​ టైటిల్​ను ఖరారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట ఇంతకీ ఆ పేరు ఏంటంటే ?

vijay devarakonda
vijay devarakonda vd 13

Vijay Parasuram Film : టాలీవుడ్​ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. 'లైగర్'​ పరాజయం తర్వాత ఆయన ఎటువంటి సినిమాల్లో నటించనున్నారని ఫ్యాన్స్​ ఎదురుచూస్తున్న తరుణంలో 'ఖుషి' సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాలో సమంత సరసన విజయ్​ నటిస్తున్నారు. 'ఖుషి' కాకుండా మరో రెండు సినిమాలకు సైన్​ చేశారు విజయ్​. గౌతమ్​ తిన్ననూరితో ఓ సినిమాతో పాటు పరశురామ్​తోనూ కలిసి పనిచేయనున్నారు. ఈ క్రమంలో ఓ వైపు 'ఖుషి' సినిమా షూటింగ్​ బిజీలో ఉన్న ఆయన ఈ రెండు చిత్రాల కోసం రంగంలోకి దిగారు.

ఇక ఈ రెండు ప్రాజెక్ట్​లు అనౌన్స్​ అయిన తర్వాత అభిమానుల్లో విజయ్​ లైనప్​పై మరింత ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పరశురామ్​ సినిమాపై ఫ్యాన్స్​ ఎక్స్​పెక్టేషనన్స్​ పెంచుకుంటున్నారు. వీరిద్దరి కాంబోలో ఉన్న 'గీతా గోవిందం' సినిమా ఇందుకు కారణం. 2018లో వచ్చిన ఈ సినిమా అటు యూత్​తో పాటు ఇటు ఫ్యామిలీ ఆడియన్స్​ను ఎంటర్టైన్​ చేసి బాక్సాఫీస్​ వద్ద మంచి హిట్​ అందుకుంది. అంతే కాకుండా విజయ్​ కెరీర్​ను ఓ మలుపు తిప్పిన సినిమాల్లో 'గీత గోవిందం' కూడా ఒక్కటి. ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరూ తాజాగా కలిశారు. 'VD 13'గా తెరకెక్కుతున్న సినిమా కోసం పని చేసేందుకు రెడీగా ఉన్నారు.

విజయ్​-పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ఇటీవలే పూజా కార్యక్రమంలో గ్రాండ్​గా స్టార్ట్ అయ్యింది. రెగ్యులర్​ షూటింగ్​ కూడా ప్రారంభం కాకుండానే ఈ సినిమాపై తాజాగా ఓ బజ్​ నెట్టింట హల్​చల్​ చేస్తోంది. 'పెళ్లిచూపులు'... 'గీత గోవిందం' లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్​కు చేరువైన విజయ్​..​ 'ఫ్యామిలీ స్టార్‌'గా మారనున్నారట. ఈ ​ సినిమాకు మేకర్స్​ 'ఫ్యామిలీ స్టార్‌' అనే పేరును ఖరారు చేయాలనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆ పేరును పరిశీలనలో ఉంచారట. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.

ఇక వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా అయినందున ఇది కూడా 'గీత గోవిందం' తరహాలో హిట్​ టాక్​ అందుకోనుందంటూ అభిమానులు అంచనాలు పెట్టుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్​ సన్నాహాలు చేస్తున్నారట. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై శిరీష్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్‌ ప్రారంభమైంది. ఇందులో విజయ్​ సరసన 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్​ నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.