ETV Bharat / entertainment

'అర్థరాత్రి నాపై దాడి చేశారు - ఇది వాళ్ల పనే!'- నటి వనిత విజయ​కుమార్ పోస్ట్​​

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 3:46 PM IST

Updated : Nov 26, 2023, 4:53 PM IST

Vanitha VijayKumar Bigg Boss : తమిళ నటి వనిత విజయకుమార్​ తాజాగా ఇన్​స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తనపై ఓ వ్యక్తి దాడి చేసినట్లు ఆమె అందులో పేర్కొన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Vanitha VijayKumar Bigg Boss
Vanitha VijayKumar Bigg Boss

Vanitha VijayKumar Bigg Boss : తమిళ నటి వనిత విజయ్​కుమార్​ సోషల్ మీడియా వేదికగా తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశారంటూ ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె మొఖంపై గాయాలతో ఉన్న ఓ ఫొటోను ఇన్​స్టాగ్రామ్ వేదికగా షేర్​ చేశారు. అయితే తమిళ 'బిగ్‌బాస్‌ సీజన్‌ 7'లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్​కు సంబంధించిన మద్దతుదారుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

  • I took first aid and left home with rage and not able to identify my attacker. He laughed like a lunatic which haunts my ears. Taking a break from everything as i am not in a physical condition to appear on screen. For those who support disturbed ppl danger is just a feet away

    — Vanitha Vijaykumar (@vanithavijayku1) November 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నిన్న రాత్రి నా సోదరి నివాసం నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఓ వ్యక్తి నాపై దాడి చేశారు. నా ముఖంపై తీవ్రగాయం చేసి వెళ్లిపోయారు. దీన్ని చూసి పోలీసులకు కంప్లైంట్​ చేయాలని నా సోదరి చెప్పింది. అయితే నాకు మాత్రం ఈ విషయంలో న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదు. అందుకే అలాంటి ప్రయత్నాలు నేను చేయలేదు. ఫస్ట్ ఎయిడ్​ తర్వాత.. నాపై దాడి చేసిన వ్యక్తి గురించి ఆలోచించాను. అతడి మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. ప్రస్తుత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ ప్రదీప్‌ ఆంటోనీ మద్దతుదారుడే ఈ దాడికి పాల్పడి ఉంటారని నాకు అనిపిస్తోంది" అంటూ ఆమె పోస్ట్‌ పెట్టారు.

Vanitha VijayKumar Movies List : 'దేవి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి వనిత. తమిళ సీనియర్​ నటుడు విజయకుమార్​ కుమార్తె అయిన ఈమె తెలుగుతో పాటు తమిళంలోనూ పలు సినిమాల్లో మెరిశారు. అయితే సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె.. చాలా ఏళ్ల తర్వాత ఇటీవలే నరేశ్​ పవిత్ర లోకేశ్​ లీడ్​ రోల్​లో తెరకెక్కిన 'మళ్ళీ పెళ్లి' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇక కోలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాలు, రియాల్టీ షోల్లోనూ ఆమె కనిపించారు. ప్రస్తుతం వనిత కుమార్తె జోవిక తమిళ 'బిగ్‌బాస్‌ సీజన్‌ 7' కంటెస్టెంట్‌గా ఉన్నారు. అయితే ఆ రియాల్టీ షో, అందులోని హౌస్‌మేట్స్‌పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వనిత తరచూ వీడియోలు షేర్‌ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న వివాదాల నేపథ్యంలో ఎవరైనా ఆమెను దాడి చేసి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

'అందుకే పవర్​స్టార్​ను 40సార్లు పెళ్లి చేసుకుంటా!'

మూడో పెళ్లికి సిద్ధమైన నటి వనితా విజయ్ కుమార్

Last Updated : Nov 26, 2023, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.