ETV Bharat / entertainment

Renu Desai Pawan Kalyan : పవన్‌కే నా సపోర్ట్​.. ఒక్క అవకాశం ఇద్దాం : రేణూ దేశాయ్‌

author img

By

Published : Aug 10, 2023, 4:30 PM IST

Updated : Aug 10, 2023, 6:05 PM IST

Renu Desai Pawan Kalyan Politics : పవన్​ కల్యాణ్​ను ఉద్దేశిస్తూ ఆయన మాజీ భార్య,నటి రేణూ దేశాయ్​ ఓ వీడియో పోస్ట్​ చేశారు. పవన్​పై ఆమె కొన్ని కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్​గా మారాయి. ఇంతకీ ఆమె ఏం అన్నారంటే?

Renu desai pawan kalyan : పవన్‌కే నా సపోర్ట్​.. ఒక్క అవకాశం ఇద్దాం : రేణూ దేశాయ్‌
Renu desai pawan kalyan : పవన్‌కే నా సపోర్ట్​.. ఒక్క అవకాశం ఇద్దాం : రేణూ దేశాయ్‌

Renu Desai Pawan Kalyan Politics : ఇటీవలే 'బ్రో' సినిమా ఎంతటి కాంట్రవర్సీ అయిందో తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వానికి చెందిన ఓ నేత.. పవన్‌ మూడు పెళ్లిల్లుపై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తానని అన్నారు. తాజాగా దీనిపై పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ స్పందించారు. ఓ వీడియోను పోస్ట్ చేశారు. పవన్‌ చాలా అరుదైన వ్యక్తి అని, రాజకీయంగా ఆయనకే తన మద్దతు ఉంటుందని ఆమె చెప్పారు. 'బ్రో' సినిమా శ్యాంబాబు వివాదం గురించి ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Bro Movie Controversy : "ఇటీవలె విడుదలైన సినిమా కాంట్రవర్సీలకు దారితీసింది. ఇదంతా జరిగినప్పుడు నేను దేశంలో లేను. తిరిగి వచ్చిన తర్వాతే తెలిసింది. కొందరు వ్యక్తులు నా మాజీ భర్త. వ్యక్తిగత విషయాలు, పెళ్లి, పిల్లలనుద్దేశించి వెబ్​ సిరీస్​లు తీస్తామంటున్నారు. ఓ తల్లిగా చెబుతున్న పిల్లలను దయచేసి పిల్లలను ఇందులో లాగకండి" అని రేణూ అన్నారు.

Renu Desai Pawan Kalyan Relationship : నా విషయంలో వంద శాతం తప్పు.. "నా విషయంలో జరిగింది వంద శాతం తప్పే. కానీ నాకు తెలిసిన, నేను చూసినంత వరకూ.. ఆయన డబ్బు ఆశించే వ్యక్తి కాదు. ఎల్లప్పుడూ సమాజానికి మంచి చేయాలని పరితపించే మనిషి. ఆయన అరుదైన వ్యక్తి. నేను నా వ్యక్తిగత విషయం పక్కనపెట్టి రాజకీయంగా మద్దతిచ్చాను, ఇస్తున్నాను కూడా. సొసైటీ కోసం.. ఆయన వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓ సక్సెస్​ఫుల్ నటుడు. దయచేసి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రతిసారీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ దయచేసి ఆపండి. నా పిల్లలనే కాదు, మిగిలిన ఇద్దరు పిల్లలను ఇలాంటి వాటిల్లోకి లాగకండి. ఎందుకంటే వాళ్లు ఇంకా చిన్నపిల్లలే" అని ఆమె చెప్పారు.

ఇక పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్​గా 'బ్రో' సినిమాతో థియేటర్లలో సందడి చేశారు. ప్రస్తుతం ఆయన 'ఓజీ' (Original Gangster), 'ఉస్తాద్ భగత్​సింగ్' (Ustad Bhagat Singh) సినిమా షూటింగ్​లో కోసం రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా గురువారం(ఆగస్ట్ 10) 'ఓజీ' సినిమాకు సంబంధించిన పోస్టర్​ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది.

అమ్మ​ కోసం అకీరా స్పెషల్‌ గిఫ్ట్.. ఇది భయపెట్టేస్తుంది అంటూ పోస్ట్!

రేణూ దేశాయ్​కు​ గుండె జబ్బు​.. ఆందోళనలో ఫ్యాన్స్!

Last Updated : Aug 10, 2023, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.