ETV Bharat / entertainment

Swayambu Nikhil : నిఖిల్ భారీ రిస్క్ మొదలుపెట్టేశాడు​.. ఇక ఆ ఛాలెంజెస్​ను ఎలా ఎదుర్కొంటారో?

author img

By

Published : Aug 19, 2023, 12:57 PM IST

Nikhil Siddharth Swayambhu : హీరో నిఖిల్ తాజాగా హిస్టారికల్ డ్రామా స్వయంభు సినిమాను సెట్స్​పైకి తీసుకెళ్లారు. అయితే ఈ సినిమా అంత ఈజీ కాదు! ఎన్నో సవాళ్లు, రిస్క్​లు ఉంటాయి? ఆ వివరాలు..

Nikhil Siddharth Swayambhu
Swayambu Nikhil : భారీ రిస్క్​ చేయనున్న నిఖిల్.. ఈ సారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో?

Nikhil Siddharth Swayambhu : 'కార్తికేయ‌-2'తో పాన్ ఇండియా స‌క్సెస్ అందుకున్న హీరో నిఖిల్.. ప్రస్తుతం 'ది ఇండియా హౌస్', స్వ‌యంభు'..'కార్తికేయ‌-3' లాంటి సినిమాలు భారీ బడ్జెట్​ సినిమాలే చేస్తున్నారు. ఇవి ఆసక్తితో పాటు అంచనాలను బాగానే పెంచాయి. అయితే ఈ మధ్య వచ్చిన ఆయన నుంచి వచ్చిన 'స్పై' భారీ డిజాస్టర్​ అందుకుంది. దీంతో ఆయన మరింత జాగ్రత్తగా ముందుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నిఖిల్​ తాజాగా తన హిస్టారికల్​ డ్రామా 'స్వయంభు'ను(swayambu nikhil) సెట్స్​పైకి తీసుకెళ్లి షూటింగ్ షురూ చేశారు. 14 శతాబ్దంలోని ఓ యోధుడి కథతో ముందుకు రాబోతున్నారు. అయితే ఈ చిత్రాన్ని రూపొందించడం అంత సులభం కాదనే చెప్పాలి. ఎన్నో ఛాలెంజెస్​, రిస్క్​తో కూడుకున్న పని అని చెప్పాలి.

ఎందుకంటే ఇలాంటి హిస్టారికల్​ డ్రామా మావీస్​ అంటే.. భారీ బడ్జెట్​, ప్లాన్స్​, ఎగ్జిక్యూషన్​ చాలా అవసరం. ముఖ్యంగా ఆర్ధిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో వచ్చిన 'మగధీర', 'బాహుబలి' సిరీస్​, 'పొన్నియిన్​ సెల్వన్​' సిరీస్​ల విషయంలో ఇలాంటి సవాళ్లను చూశాం. ఇప్పుడు 'స్వయంభు'(nikhil swayambu budget) కోసం రూ.30కోట్లు పెడుతున్నారని తెలిసింది. అయితే ఈ సినిమా కథకు ఉన్న డిమాండ్ ఆధారంగా.. ఆ రేంజ్​ బడ్జెట్​లో పూర్తవ్వడం కష్టమని అంచనా వేస్తున్నారు నిపుణలు. బడ్జెట్​ పెరిగే అవకాశముందని అంటున్నారు. నిర్మాతలు రాజీపడి చిత్రాన్ని తెరకెక్కిస్తే.. సినిమా క్వాలిటీ విషయంలో విమర్శలు ఎదురౌతాయని చెబుతున్నారు.

మరో సవాల్ ఏంటంటే.. అసలు ఇలాంటి హిస్టారికల్ డ్రామా నిఖిల్​కు సెట్ అవుతుందా?​ యోధుడి పాత్రలో నిఖిల్​ను చూడగలమా? యోధుడి పాత్ర అంటే ముఖంలో గంభీరం, బలమైన దేహధారుడ్యం ఉండాలి. అలాగే బలమైన నటనతో ప్రేక్షకుల్ని కట్టిపడేయగలగాలి. ఇప్పటికే బాహుబలిలో ప్రభాస్​, మగధీరలో రామ్​చరణ్​ తమ నటనతో నిరూపించారు. యోధుడిగా వారి స్ర్రీన్​ ప్రెజెన్స్​ ఎంతో పర్ఫెక్ట్​గా సెట్ అయింది. ఆడియెన్స్​ వారికి కనెక్ట్ అయ్యారు. మరి కూల్ అండ్ డీసెంట్​ లుక్​ ఉండే నిఖిల్​.. ఇప్పటివరకు యోధుడి లాంటి పాత్రలను చేయలేదు. పవర్​ఫుల్ యాక్టింగ్​లో కూడా కనిపించలేదు. కాబట్టి ఇప్పుడీ పాత్ర ఆయనో పెద్ద సవాల్ లాంటిదనే చెప్పాలి. ఈ పాత్ర కోసం ఆయన తనలోని మరింత యాక్టింగ్ స్కిల్​ను బయట పెట్టాలి. అలాగే తన బాడీ లాంగ్వేజ్​ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ యోధుడి పాత్ర కోసం నిఖిల్​ ఎలా సన్నద్ధమవుతున్నారు? అనేది చూడాలి.

ఏదేమైనప్పటికీ నిఖిల్ రొట్ట కథల నుంచి బయటకు వచ్చి డిఫరెంట్​ కాన్సెప్ట్​ను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో 'స్వయంభు' లాంటి కథను ఎంచుకోవడం మంచి విషయమే. మరి నిఖిల్​ ఈసమస్యలను, సవాళ్లను అధిగమించి ప్రేక్షకుల ముందుకు ఎలా వస్తారా? సినీ ప్రియులను ఎంత వరకు ఆకట్టుకుంటారో? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

'స్పై'ఎఫెక్ట్.. ఆ దర్శకనిర్మాతలకు నిఖిల్ గట్టి కండిషన్!

అభిమానులకు హీరో నిఖిల్ క్షమాపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.