'ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా?'.. బాలయ్య సూటి ప్రశ్నకు పవన్​ జవాబు...

author img

By

Published : Jan 27, 2023, 7:08 PM IST

Updated : Jan 27, 2023, 8:40 PM IST

nbk unstoppable pspk promo

నటసింహం బాలకృష్ణ, పవర్​ స్టార్​ ఫ్యాన్స్​ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఎన్​బీకే అన్​స్టాపబుల్​లో పవన్​ కల్యాణ్​ ఎపిసోడ్​ పార్ట్​-1 ప్రోమో రిలీజయ్యింది. దీంతో ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్​గా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే'. ఈ షోకు ఇటీవల సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వచ్చారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ ఎపిసోడ్​ను రెండు పార్ట్​లుగా ప్రసారం చేయనున్నారు. ఈ ఎపిసోడ్​పై అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు ఆహా ప్లాట్​ఫామ్​, 'బాప్​ ఆఫ్​ ఆల్​ ఎపిసోడ్స్'​ అంటూ పవన్​ ఎపిసోడ్​పై అంతకంతకూ అంచనాలు పెంచుతోంది. ఈ క్రమంలో ఆహా ప్లాట్​ఫామ్​ పవన్​కల్యాణ్​ ఎపిసోడ్​ పార్ట్​-1 ప్రోమోను విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్​ సంబరాలు చేసుకుంటున్నారు.

తాజాగా విడుదలైన ప్రోమోలో పవన్​కు.. బాలయ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలను ప్రోమోలో చూపించారు. 'ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా' అంటూ సరదాగా పవన్​ చేయి పట్టుకున్నారు బాలకృష్ణ. దీనికి పవన్​ మంచి ప్రాసలో 'నేను మీకు తెలుసు నా స్థానం మీ మనసు' అంటూ స్పాంటేనిటీ చూపించారు. ఆ తర్వాత పవన్​ కల్యాణ్​ను ఓ ఆట ఆడుకున్నారు బాలకృష్ణ. 'ఇప్పుడు గుడుంబా శంకర్​ సినిమాలో ప్యాంట్​ మీద ప్యాంట్​ వేసుకున్నావ్.. అలా ప్యాంట్​ వేస్తే పాతికేళ్ల వయసు తగ్గావ్​ ' అంటూ ఆటపట్టించారు. ఆ తర్వాత 'మనిద్దరం మొదటి సారి ఎక్కడ కలిశామో తెలుసా' అని అడిగారు బాలయ్య. దానికి ఇద్దరూ కలిసి దిగిన ఓ ఫొటో చూపించి' నేను కుర్రాడిలా ఉన్నాను కదా' అని అన్నారు. దీనిపై పవన్​ స్పందిస్తూ' ఇప్పటికీ అలాగే ఉన్నారని' అని అన్నారు. దీనికి బాలయ్య ప్రేక్షకుల వైపు చూసి కన్ను కొడుతూ నవ్వులు పూయించారు. 'త్రివిక్రమ్​ నువ్వు మంచి ఫ్రెండ్స్​ కదమ్మా..' అని బాలయ్య అడిగారు. పవన్​ 'ఫ్రెండ్స్​ అవ్వాల్సి వచ్చింది' అని నవ్వు తెప్పించారు.

బాలయ్య'సరదాగా సాయంత్రం పూట' అని దేని గురించో ప్రశ్న అడిగారు. '4 తర్వాతా లేక 6 తర్వాతా' అని పవన్​ చెప్పిన సమాధానం నవ్వు తెప్పించింది. అనంతరం 'రామ్​చరణ్​కు నీకు క్లోజ్​నెస్​ ఎలా ఏర్పడింది' అని బాలయ్య అడిగారు. 'అప్పుడు నాకు వీళ్ల డ్యూటీ ఉండేది ' అని పవన్​ అన్నారు. 'నాగబాబు ఉన్నాడు కదా మధ్యలో' అన్నారు బాలయ్య. దానికి పవన్​'నాగబాబు అప్పుడు నిర్మాతగా ఉన్నారు కాబట్టి​.. ఇంట్లో నేనొక్కడినే దొరికిపోయేవాడ్ని' అని అన్నారు. బాలయ్య స్పందిస్తూ 'అలా పిల్లల్తో క్లోజ్​ అయ్యావు' అన్నారు. 'క్లోజ్​ అవ్వాల్సి వచ్చింది' అని నవ్వుతూ అన్నారు పవన్. ఆ తర్వాత రామ్​ చరణ్​కు ఫోన్​ చేసి 'నీ గుడ్​ న్యూస్​ మింగేసి అతడి (ప్రభాస్​ని ఉద్దేశిస్తూ)గుడ్​న్యూస్​ చెప్పావు' అని ఇడిగారు. ఆ తర్వాత కొన్వి ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

ఆ తర్వాత మెగా అల్లుడు సాయిధరమ్​ తేజ్​ ఎంట్రీ ఇచ్చారు. లుంగీ కట్టుకుని వచ్చిన సాయి తేజ్​ను.. 'పెళ్లికి వచ్చావా' అంటూ అటపట్టించారు బాలకృష్ణ. దానిపై స్పందిస్తూ 'హార్రర్​ సినిమాలకు అమ్మాయిలకు తేడా లేదు' అంటూ బాంబు పేల్చారు. ఆ తర్వాత బాలకృష్ణ తొడకొట్టమంటే.. సాయి తేజ్​.. బాలయ్య తొడ కొడతా నంటూ వెళ్లి నవ్వులు పూయించారు. ఈ క్రమంలో షో ఇంటెన్సిటీ​ని పెంచూతూ కీలకమైన ప్రశ్న సంధించారు బాలయ్య. 'ఈ పెళ్లిళ్ల గొడవ ఎంటి భయ్యా' అంటూ అడిగేశారు. అంతే ఇంటెన్స్​గా 'వాళ్లు బాధ పడతారేమోన్న బాధతో.. నా విజ్ఞత సంస్కారం మాట్లాడకుండా ఆపేస్తాయంటూ.. ' గ్యాప్​ ఇచ్చారు పవర్​ స్టార్. ఆ తర్వాత 'ఇంత మానసిక సంఘర్షణకు గురైన పవన్​ కల్యాణ్​.. పవర్​ స్టార్​ ఎలా అయ్యాడు' అని బాలయ్య ఆసక్తి రేపే ప్రశ్న అడిగారు. దానికి 'అన్నయ్య రూమ్​లోకి వెళ్లి.. పిస్టల్​ తీసుకుని..' అంటూ ఆపేశారు పవన్​. దీంతో షోపై ఆంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఈ ప్రోమో పవన్‌ కల్యాణ్​ ఎపిసోడ్​పై ఆసక్తి పెంచుతోంది. కాగా, సీజన్ 2 చివరి ఎపిసోడ్​గా పవన్ కల్యాణ్​ ఎపిసోడ్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈ ఎపిసోడ్ ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Jan 27, 2023, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.