ETV Bharat / entertainment

''మేజర్​' గురించి షాకింగ్ విషయాలు.. సందీప్ జీవితంలో అవి కూడా..'

author img

By

Published : Jun 2, 2022, 11:31 AM IST

Major Movie: 26/11 ముంబయి ఉగ్రదాడి నేపథ్యంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మేజర్'​ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ క్రమంలోనే మేజర్ సందీప్​ గురించి ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. సందీప్‌ నిజ జీవితంలో ఆహ్లాదకరమైన సంఘటనలు, బాధలు.. అన్నీ ఉన్నాయని తెలిపారు.

major movie
Adivi Sesh

Major Movie: "కల్పిత కథల్ని ఎలాగైనా చేయొచ్చు. 'మేజర్‌' తరహా కథలకి ఎన్నో పరిమితులు ఉంటాయి. వాటి మధ్య సినిమా చేయడం ఓ ప్రత్యేకమైన అనుభవం" అన్నారు దర్శకుడు శశికిరణ్‌ తిక్క.'గూఢచారి'తో దర్శకుడిగా విజయాన్ని అందుకున్న ఆయన.. తాజాగా 'మేజర్‌' చిత్రానికి దర్శకత్వం వహించారు. 26/11 హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అడివి శేష్‌ కథానాయకుడిగా నటించారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు శశికిరణ్‌.

major movie
.

"మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ 31 ఏళ్ల జీవిత ప్రయాణమే ఈ సినిమా. ఆయన చుట్టుపక్కల వారి ప్రయాణాన్నీ చూపించాం. నేను, శేష్‌ ఎప్పట్నుంచో స్నేహితులం. మా కెరీర్‌ ఆరంభం కాక ముందే తను 'మేజర్‌' నా కలల ప్రాజెక్ట్‌ అన్నారు. ఆ తర్వాత మేం 'గూఢచారి' చేశాం. తర్వాత ఎవరి సినిమా ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నప్పుడు శేష్‌ వచ్చి ఈ ప్రాజెక్ట్‌ గురించి చెప్పారు. కొంత సమయం తీసుకుని 'మేజర్‌' గురించి స్టడీ చేశా. ఆ క్రమంలో పాత్ర నన్ను బాగా ఆకట్టుకుంది. సందీప్‌ తల్లిదండ్రుల్ని కలిశా. అప్పుడే ఈ కథని చెప్పాల్సిందే అనుకున్నా. సందీప్‌ గురించి సీబీఎస్‌ఈ టెక్ట్స్‌ బుక్స్‌లో ఓ ఛాప్టర్‌ మాత్రమే ఉంది. మిగిలిన జీవితాన్నంతా తెలుసుకుని ఒళ్లు దగ్గర పెట్టుకుని సినిమా చేశాం"

major movie
'మేజర్​'
  • "మూడేళ్లుగా సందీప్‌ తల్లిదండ్రుల్ని కలుస్తూ, పలు విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేస్తూ వచ్చాం. సందీప్‌ నిజ జీవితంలో ఆహ్లాదకరమైన సంఘటనలు, బాధలు.. అన్నీ ఉన్నాయి. మేం అవన్నీ విని ఎంతో అనుభూతి చెందాం. ఆ అనుభూతే ప్రేక్షకులకు కలిగేలా ఈ సినిమా చేశాం. ప్రకాశ్‌రాజ్‌, రేవతి పాత్రలు హృదయాల్ని మెలిపెడతాయి. సందీప్‌ తల్లిదండ్రులు మంగళవారమే బెంగళూరులో సినిమా చూశారు. చాలా మెచ్చుకున్నారు. 'మేజర్‌' స్టార్‌ హోటళ్లలో సాగే సినిమా. 1990నాటి హోటల్స్‌ వాతావరణాన్ని కళ్లకు కట్టాల్సి వచ్చింది. అందుకోసం హైదరాబాద్‌లోని పలు హోటళ్లల్లో చిత్రీకరణ చేశాం. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఏడు సెట్స్‌ వేశాం. అహ్మదాబాద్‌, లఖ్​నవూ తదితర ప్రాంతాల్లో యాక్షన్‌ ఘట్టాల్ని తీశాం"
  • "తన సినిమాని అందరూ చూడాలనే కోరిక ప్రతీ సినీ రూపకర్తకీ ఉంటుంది. కథల్ని బట్టే వాటిని ఏ స్థాయిలో తీయాలో నిర్ణయిస్తాం. కథలు యూనివర్సల్‌గా ఉన్నప్పుడు అవి పాన్‌ ఇండియా చిత్రాలుగా మారిపోతాయి. కొన్నిసార్లు నిర్మాతల్ని బట్టి ఆయా సినిమాలు రూపొందుతుంటాయి. తదుపరి రెండు కథల్ని సిద్ధం చేసుకున్నా. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో సినిమా చేయాలి. ఆ వివరాల్ని త్వరలోనే చెబుతాం"
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'ఆయన రియాక్షన్​ చూశాక ఆస్కార్​ దక్కినట్టు అనిపించింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.