ETV Bharat / entertainment

'అసలు వేట మొదలైంది'.. 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్​​

author img

By

Published : Jul 16, 2022, 10:24 PM IST

రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా ట్రైలర్​ విడుదలైంది. తన మాస్​ డైలాగులతో ట్రైలర్​లో అదరగొట్టారు రవితేజ.

hero raviteja movie ramarao on duty trailer released
'అసలు వేట మొదలైంది'.. 'రామారావు ఆన్ డ్యూటీ' ట్రైలర్ రిలీజ్​​

రవితేజ హీరోగా శరత్‌ మండవ తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'రామారావు ఆన్‌ డ్యూటీ' . సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. రజిషా విజయన్‌, దివ్యాంశ కౌశిక్‌ కథానాయికలు. వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై 29న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో శనివారం రాత్రి చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. మాస్‌ అభిమానులను మెప్పించేలా రవితేజ నటన, డైలాగ్స్‌తో అదరగొట్టారు. 1995 నాటి నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. దీనికి సామ్‌ సిఎస్‌ స్వరాలందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: కట్టు, బొట్టు అదిరిందమ్మా స్రవంతి.. ట్రెడిషనల్​ లుక్స్​లో హోమ్లీగా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.