ETV Bharat / entertainment

ఇంట్రెస్టింగ్​గా ధనుష్- శేఖర్ కమ్ముల మూవీ పోస్టర్! నాగార్జునతో లింక్ ఏంటి?

author img

By

Published : Jul 27, 2023, 11:00 PM IST

తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త సినిమా అప్​డేట్ వచ్చేసింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించనున్న ఈ సినిమా పోస్టర్​ను మూవీమేకర్స్ గురువారం రిలీజ్ చేశారు. ఆ వివరాలు..

dhanush new movie d51
ధనుష్ కొత్త సినిమా అప్​డేట్

తమిళ స్టార్ హీరో ధనుష్ - దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాను మూవీమేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'డీ51' అనే వర్కింగ్ టైటిల్​ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఇక హీరో ధనుష్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ పోస్టర్​ను గురువారం రిలీజ్ చేసింది చిత్రబృందం. కాగా ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమా పోస్టర్​లో పెద్ద భవనాలు, గుడిసెలను చూపించారు. అయితే వీటి మధ్య పాత కరెన్సీ నోట్లను ఉంచడం ఆసక్తిని కలిగిస్తోంది. కాగా కరెన్సీ నోట్లను చూపడం వల్ల కథ అవినీతి చుట్టు సాగనుందని సమాచారం. అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇదివరకు రాజకీయ నేపథ్యం ఉన్న కథతో 'లీడర్' సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకున్నారు. మరి తాజా చిత్రం అదే జోనర్​లో సాగుతుందా? ఏదైనా డిఫరెంట్ పాయింట్​ను తీసుకుంటారా అని వేచి చూడాలి.

కాగా ఈ సినిమాలో హీరో ధనుష్ లుక్ చాలా కొత్తగా ఉండనుందట. అయితే శేఖర్ కమ్ముల - ధనుష్ సినిమా అనగానే ఫ్యాన్స్​లో అంచానాలు పీక్స్​లో ఉన్నాయి. ఈ సినిమాలో ధనుష్​కు జోడీగా రష్మిక మందన్నా జతకట్టనున్నారని.. సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందించనున్నారని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ విషయాలను చిత్రబృందం మాత్రం ప్రకటించలేదు.

అయితే ధనుష్ రీసెంట్​గా 'సార్' సినిమాతో సక్సెస్ అందుకొని ఫుల్​ జోష్​లో ఉన్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించి.. యాభై కోట్లకు పైగా కలెక్షన్లు వసూల్ చేసింది. దీంతో తెలుగులో ధనుష్​కు మార్కెట్ పెరిగింది. ఇక ధనుష్ ప్రస్తుతం ​'కెప్టెన్ మిల్లర్' సినిమా షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం తీవ్ర పోటీ ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హీరోయిన్​గా ప్రియాంక అరుల్ మోహన్ నటించనున్నారు. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా.. తెలుగు, తమిళం, హిందీలో విడుదల కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.