ETV Bharat / entertainment

Comedian Dhanraj Direction : వేణు బాటలోనే ధన్​రాజ్​.. త్వరలో డైరెక్టర్​గా.. 'బలగం' లాంటి స్క్రిప్ట్ రెడీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 1:29 PM IST

Updated : Oct 9, 2023, 6:03 PM IST

Comedian Dhanraj Direction : టాలీవుడ్​ ప్రముఖ కమెడియన్ ధన్​రాజ్.. తన సహ నటుడు వేణు బాటలో నడవనున్నాడు. అతి త్వరలోనే ధన్​రాజ్​ మెగా ఫోన్ పట్టబోతున్నారు.

Comedian Dhanraj Direction
Comedian Dhanraj Direction

Comedian Dhanraj Direction : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్​గా మంచి పేరు తెచ్చుకున్నారు నటుడు ధన్​రాజ్. బుల్లితెర కామెడి ప్రోగ్రామ్​ జబర్దస్త్​ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా ఆయన సహ నటుడు, సీనియర్ కమెడియన్ వేణు యెల్దండి బాటలో నడవనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటుడు ధన్​రాజ్ డైరెక్టర్​గా మారబోతున్నారు.

కమెడియన్ ధన్​రాజ్.. తండ్రి కుమారుల సెంటిమెంట్​తో ఎమోషనల్​గా ఉండే కథను సిద్ధం చేసుకున్నారట. బలగం సినిమాలా, పక్కా ఎంటర్​టైన్​మెంట్​తో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ.. రెండింటిని బ్యాలెన్స్ చేసే స్క్రిప్ట్​తో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటుడు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించనున్నట్లు టాక్. ఇక ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ ఇదే నెలలో ప్రారంభం కానుంది. తక్కువ షెడ్యూల్స్​లో చిత్రీకరణ పూర్తి చేసి.. సినిమాను త్వరగా రిలీజ్ చేయాలని ధన్​రాజ్ భావిస్తున్నారట. సాంకేతిక నిపుణులు, నిర్మాత, నటీనటులు తదితర వివరాలు రెండు లేదా మూడు రోజుల్లో తెలియనున్నాయి. మరి కమెడియన్​గా సూపర్ హిట్టైన ధన్​రాజ్.. దర్శకుడిగా ఎంతవరకు రాణిస్తారో చూడాలి. అయితే ధన్​రజ్​ డైరెక్టర్​గా మారేకన్నా ముందు ఓ సినిమాకు నిర్మాతగా వ్యవహరించి నష్టపోయారు!
ఇకపోతే ఇండస్ట్రీలో కమెడియన్లు హీరోలుగా మారడం కొత్తేమి కాదు. ఇలాంటి సందర్భాలు మన టాలీవుడ్​లోనే ఉన్నాయి. అయితే హాస్య నటులు డైరెక్టర్లుగా మారడం మాత్రం అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలా మారిన వారు సక్సెస్​ అయిన సందర్భాలూ చాలా తక్కువే. మోస్ట్​ సీనియర్​ కమెడీయన్లు ఏవీఎస్ తీసిన 'సూపర్​ హీరోస్'​, ఎంఎస్ నారాయణ డైరెక్ట్ చేసిన 'కొడుకు', ధర్మవరపు సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో వచ్చిన 'రెండు తోకల పిట్ట' ఇలా ఎందరో స్టార్ కమెడియన్లు డైరెక్షన్​లోకి దిగి నిరాశ చెందారు. ఈ క్రమంలో వీటన్నింటికీ సమాధానంగా ఈ ఏడాది వచ్చిన 'బలగం' సినిమాతో డైరెక్టర్​గా తన మొదటి ప్రయత్నంలోనే బ్లాక్​బస్టర్​ హిట్ అందుకున్నారు జబర్దస్​ స్టార్ కమెడియన్​ వేణు యెల్దండి. పైగా ఈ చిత్రానికి బడా నిర్మాత దిల్​రాజు నిర్మాతగా వ్యవహరించారు.

  • Update:

    Actor - Comedian #Dhanraj will make his direction debut with super performer #Samuthirakani as main lead. The story is set to be an emotional ride between a father and son. This film likely to go on sets from 22nd October.

    — Movies4u Official (@Movies4u_Officl) October 8, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Suhas New Movie : అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. సౌండ్ అదిరింది.. సుహాస్ యాక్టింగ్ కేక

Bigg Boss Subhashree : బిగ్​బాస్​ హౌస్ నుంచి క్యూటీ ఔట్.. 5వారాలకు ఎంత ఛార్జ్​ చేసిందో తెలుసా?

Last Updated : Oct 9, 2023, 6:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.