ETV Bharat / entertainment

Bro OTT Streaming : ఓటీటీలో 'బ్రో' ఫస్ట్ డే రెస్పాన్స్​.. ఏంటి ఇంత తక్కువా?.. 'బేబీ' దూసుకెళ్లిందిగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2023, 4:18 PM IST

Bro OTT Streaming : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్రో : ది అవతార్' తాజాగా ఆగస్ట్ 25న ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రానికి తొలి రోజు డీసెంట్​ రెస్పాన్స్ వచ్చింది. అయితే 'బ్రో'తో పాటు రిలీజైన 'బేబీ' చిత్రం మరింత ఎక్కువ రెస్పాన్స్​ను అందుకుంది. ఆ వివరాలు..

Bro OTT Streaming : ఓటీటీలో 'బ్రో' ఫస్ట్ డే రెస్పాన్స్​.. ఏంటి ఇంత తక్కువా?.. 'బేబీ' దూసుకెళ్లిందిగా!
Bro OTT Streaming : ఓటీటీలో 'బ్రో' ఫస్ట్ డే రెస్పాన్స్​.. ఏంటి ఇంత తక్కువా?.. 'బేబీ' దూసుకెళ్లిందిగా!

Bro OTT Streaming : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'బ్రో : ది అవతార్'. ఇందులో ఆయన తన మేనల్లుడు మెగా యంగ్ హీరో సాయి ధరమ్​ తేజ్​తో కలిసి నటించారు. ఇటీవలే గ్రాండ్​గా రిలీజైన ఈ చిత్రం మిక్స్​డ్​ టాక్​ను తెచ్చుకుంది. అలాగే ఎన్నో రాజకీయ వివాదాలను ఎదుర్కొంది. అయినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. తాజాగా ఈ చిత్రం ఆగస్ట్ 25న ఓటీటీలోకి వచ్చేసింది. తొలి రోజే డీసెంట్ రెస్పాన్స్ అందుకుంది. అలాగే ఈ చిత్రంతో పాటు ఆగస్ట్ 25 ఆనంద్​ దేవరకొండ బేబీ కూడా ఓటీటీలోకి వచ్చి మరింత ఎక్కువ రెస్పాన్స్​ను అందుకుంది.

Bro Movie Collections : 'బ్రో' చిత్రం జులై 28న రిలీజైంది. అయితే ఈ సినిమా.. పవన్ స్టార్​ స్టేటస్​కు తగ్గట్టు హిట్​ కాలేదని మొదట టాక్​ వచ్చింది. ఎందుకంటే పవన్ రేంజ్​కు తగ్గట్టు ఒక్క పాట, ఫైట్ లేదని చాలా మంది అన్నారు. కానీ ఈ చిత్రం ఫామిలీ ఆడియెన్స్​కు బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ చిత్రం ఫుల్ రన్ టైమ్​లో 70 కోట్ల రూపాయిల వరకు అందుకుంది. 'అత్తారింటికి దారేది', 'వకీల్ సాబ్' తర్వాత 'బ్రో ది అవతార్' చిత్రమే ఫ్యామిలీ ఆడియెన్స్​కు బాగా నచ్చింది. బ్రో సినిమా ముందు వచ్చిన భీమ్లానాయక్​కు కేవలం అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్​కు పర్వాలేదనింపించింది. ​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bro VS Baby Movie OTT Response : ఇకపోతే ఈ చిత్రం రీసెంట్​గానే ఓటీటీ నెట్​ఫ్లిక్స్​లో ఆగస్ట్ 25న వచ్చింది. తొలి రోజు డీసెంట్​ రెస్పాన్సే అందుకున్నట్లు తెలిసింది. తొలి రోజు 24 గంటల్లో 70 మిలియన్ వాచ్ మినిట్స్ వచ్చాయని అంటున్నారు. పవన్ రేంజ్​కు ఇది తక్కువనే చెప్పాలి! అయితే ఈ రేంజ్ వ్యూస్ రీసెంట్​గా వచ్చిన ఏ బడా చిత్రానికి రాలేదట. ప్రభాస్ ఆదిపురుష్​కు మొదటి 24 గంటల్లో 50 మిలియన్ వాచ్ మినిట్స్ మాత్రమే వచ్చాయట. అయితే ఇదే సమయంలో 'బ్రో'తో పాటు వచ్చిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య 'బేబీ'(Baby OTT Response) 32 గంటల్లో ఏకంగా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్​ను అందుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆహా టీమ్​ అధికారికంగా ప్రకటించింది.

Baby OTT Release : OTTలోకి కల్ట్ బ్లాక్ బస్టర్.. వామ్మో.. ఒక్కరోజులోనే ఈ రేంజ్​ రెస్పాన్సా?

August Last Week Movie Release OTT : ఈ వీకెండ్​.. ఓటీటీలోకి 13 క్రేజీ సినిమా/సిరీస్​లు.. బ్లాక్ బస్టర్ ​'బ్రో', 'బేబీ' కూడా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.