ETV Bharat / entertainment

Balakrishna NBK 109 Remuneration : వరుసగా 3 హిట్లు.. 4 రెట్లు పెంచేసిన బాలయ్య.. బాబీ సినిమా కోసం అన్ని కోట్లా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 12:11 PM IST

Updated : Oct 31, 2023, 7:39 PM IST

Balakrishna NBK 109 Remuneration : బాలకృష్ణ.. బాబీతో చేయబోయే సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్​ పెంచేశారని తెలిసింది. ఇంతకీ బాలయ్య ఎంత వసూలు చేస్తున్నారంటే?

Balakrishna NBK 109 Remuneration : వరుసగా 3 హిట్లు.. 4 రెట్లు పెంచేసిన బాలయ్య.. వామ్మో అన్ని కోట్లా?
Balakrishna NBK 109 Remuneration : వరుసగా 3 హిట్లు.. 4 రెట్లు పెంచేసిన బాలయ్య.. వామ్మో అన్ని కోట్లా?

Balakrishna NBK 109 Remuneration : టాలీవుడ్​లో ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస విజయాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్​ను కూడా ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలు సక్సెస్ అవ్వడంతో మంచి జోరు మీదున్నారు. అయితే ఇప్పుడాయన తన తర్వాతి సినిమా NBK 109 కోసం భారీగా పారితోషికం పెంచేశారని టాక్ వినిపిస్తోంది.

వివరాళ్లోకి వెళితే.. బాలయ్య నుంచి తాజాగా రిలీజైన భగవంత్ కేసరి కోసం రూ.18కోట్లు తీసుకున్నారని సమాచారం అందింది. అంతకుముందు వీరిసింహా రెడ్డి కోసం తీసుకున్నదాని కన్నా రూ.4 కోట్లు ఎక్కువట. అంటే వీరసింహారెడ్డికి రూ.14కోట్లు. ఇక బ్లాక్ బాస్టర్ హిట్​ అఖండ కోసం రూ.10కోట్లు తీసుకున్నారట. దాన్ని కన్నా ముందు వచ్చిన రూలర్​ చిత్రం కోసం రూ.7కోట్లు వసూలు చేశారని తెలిసింది.

అంటే ఒక్కో సినిమా హిట్​ అవుతూ వెళ్తుండడంతో​ అందుకు తగ్గట్టే.. సినిమా సినిమాకు రూ.4కోట్ల వరకు పెంచుకుంటూ వెళ్తున్నారు బాలయ్య. అయితే ఈ సారి దర్శకుడు బాబీతో చేయబోయే సినిమాకు మాత్రం ఏకంగా రూ.10కోట్లు పెంచేశారని బయట కథనాలు వస్తున్నాయి. NBK 109 కోసం రూ.28 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

చిరంజీవిదే టాప్ ప్లేస్ : టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవినే భారీగా ఎక్కువగా తీసుకుంటున్నారని సమాచారం. ఏకంగా రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారట. ఆయన తర్వాత నందమూరి బాలకృష్ణ రూ. 28 కోట్లు ఛార్జ్ చేస్తున్నారని ఇప్పుడు తెలిసింది. ఇక మిగిలిన.. విక్టరీ వెంకటేశ్​, అక్కినేని నాగార్జున మాత్రం రూ. 10 - 12 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారని ఫిల్మ్​ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ఇకపోతే NBK109 విషయానికొస్తే.. పోస్టర్‌తోనే మూవీటీమ్​.. అందరి దృష్టిని ఆకర్షించింది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రానున్నట్లు సమాచారం. ఇందులో బాలయ్య క్లాసీ లుక్‌లో కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. అలాగే చిత్రంలో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ ఉంటుందట. ఈ చిత్రంలోనూ ద్విపాత్రాభినయం ఉంటుందని అంటున్నారు. ఓ మలయాళ అగ్ర హీరో కూడా నటిస్తారని ఆ మధ్య బాగా ప్రచారం సాగింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Balakrishna Hat Trick Hits : హ్యాట్రిక్​ హిట్స్​తో ట్రెండ్ సెట్ చేసిన బాలకృష్ణ.. ఆ హీరోలే టార్గెట్!

Sreeleela Movie Promotions : తీరిక లేని కాల్షీట్లు​.. అయినా ఆ మూవీ ప్రమోషన్లపై శ్రీలీల స్పెషల్​ ఇంట్రెస్ట్.. ఎవరి కోసం?

Last Updated : Oct 31, 2023, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.